Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Daily Astrology: జులై 3 రాశిఫలాలు - ఈ రాశులవారి ఇంట సౌభాగ్యం...అనుకోని ధనలాభం

Daily Astrology: జులై 3 రాశిఫలాలు - ఈ రాశులవారి ఇంట సౌభాగ్యం...అనుకోని ధనలాభం

hmtv 1 week ago

Daily Astrology: పరాభవ నామసంవత్సరం గ్రీష్మ ఋతువులో భాగంగా జులై 3న ఒక విశేషమైన రోజుగా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు నిజ జ్యేష్ఠమాసం, షష్ఠి తిథి మధ్యాహ్నం వరకు ఉన్నది.

అదేవిధంగా సాయంత్రం వరకు పూర్వాభాద్ర నక్షత్రం, మధ్యాహ్నం 3.51 గంటల వరకు సౌభాగ్యయోగం ఉండటంతో పలు రాశుల వారికి అనేక శుభకరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకోని ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

మేషరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అనేక సమస్యల నుంచి బయటపడతారు. వ్యపారస్తులకు అనుకూలమైన రోజు. పెట్టుబడులు పెట్టేందుకు శుభకాలం. గతంలో నిలిచిపోయిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కలిసి వస్తుంది. ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది. .

వృషభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులకు అనుకూలమైన రోజు. ప్రమోషన్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. వివదాల నుంచి బయటపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

మిథునరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా వాటిని నిర్వహిస్తారు. అవసరానికి కావలసిన ధనం చేతికి అందుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది.

కర్కాటకరాశి

ఈరోజు ఈరాశివారికి పలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపాటు పనికిరాదు. పదిమందికి మేలుచేసేందుకు ప్రయత్నిస్తారు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. అయితే, ఈరాశివారు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి.

సింహరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఈరోజు ఏ పని మొదలుపెట్టినా పూర్తిచేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. బాల్య స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. స్తిరాస్థి కొనుగోలు ప్రయత్నిస్తారు. ఉద్యోగుల్లో నూతనోత్సాహం నెలకొంటుంది.

కన్యారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగులు కోరుకున్న విధంగానే ప్రమోషన్లు, బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో అనుకోని లాభాలుంటాయి. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది.

తులారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. నూతన కార్యక్రమాలు చేపట్టేందుకు ఆసక్తిచూపుతారు. బాధ్యతలు పెరిగినా వాటిని నిర్వహించడంలో సఫలమౌతారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఉండవు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి.

వృశ్చికరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వాహనాలను, భూములను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. గతంలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. రాదనుకున్న ధనం చేతికి అందుతుంది. ఆర్థికంగా ఈరోజు బాగుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

ధనస్సురాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. వివాదాల నుంచి బయటపడతారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోజు గడుస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. పలు రంగాల్లోని వారికి విజయావకాశాలు ఉన్నాయి. పుత్ర సంతానం కలిగే అవకాశం ఉంది.

మకరరాశి

ఈరోజు ఈరాశివారికి అన్నివిధాలుగా బాగుంటుంది. నూతన పరిచయాలు మీ పురోభివృద్ధికి సహకరిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. పని ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. దృఢ నిర్ణయాలు తీసుకుంటారు.

కుంభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. అనుకోని విధంగా బాధ్యతలు పెరుగుతాయి. వివాదాలు చుట్టుముట్టే అవకాశం ఉంది. ఆర్థికంగా నిరాశజనకంగా ఉంటుంది. ఉద్యోగులు ఒత్తిడితో పనిచేస్తారు. అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. అనుకోని విధంగా రాబడి పెరుగుతుంది. పెద్దల సలహాలతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్తిరాస్థిని సొంతం చేసుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి పూర్తిస్థాయి ఫలితాలు పొందాలనుకుంటే నిపుణులైన జ్యోతిష్య పండితులను సంప్రదించాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu