Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Daily Horoscope: జులై 2 రాశిఫలాలు - గురుబలంతో అంతులేని విజయం ఈ రాశుల సొంతం

Daily Horoscope: జులై 2 రాశిఫలాలు - గురుబలంతో అంతులేని విజయం ఈ రాశుల సొంతం

hmtv 1 week ago

Daily Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాల సంచారం, తిథి, నక్షత్రం, యోగం, కరణం వంటి అంశాలు మన దైనందిన జీవితంపై ప్రభావం చూపుతాయి.

జులై 2, గురువారం నిజ జ్యేష్ఠ మాస బహుళ పక్ష విదియ తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం, గరజి కరణంతో పాటు గురువారం కావడంతో గురుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా విద్య, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ నిర్ణయాల్లో ఆలోచించి ముందుకు అడుగు వేయడం మంచిది. అదేవిధంగా ఈరోజు వీలైనంత వరకు గురువులను పూజించడం, శ్రీమహావిష్ణువు, దక్షిణామూర్తిని ఆరాధించడం శుభప్రదంగా భావిస్తారు. మరి ద్వాదశ రాశులపై వీటి ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం.

మేషరాశి

ఈ రాశివారికి రోజు ఆశాజనకంగా ఉంటుంది. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన అపార్థాలు తొలగిపోతాయి. ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకునేవారికి మంచి అవకాశం లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

వృషభరాశి

ఈ రోజు వృషభ రాశివారికి లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. అదనపు ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. పెట్టుబడులు పెట్టాలనుకుంటే నిపుణుల సలహాతో ముందుకు వెళ్లడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

మిథునరాశి

ఈ రాశివారు ప్రతి విషయంలో ఓర్పుతో వ్యవహరించాలి. పనులు ఆశించిన వేగంతో పూర్తికాకపోవచ్చు. మాటలో జాగ్రత్త అవసరం. చిన్న అపార్థం పెద్ద వివాదానికి దారితీయకుండా చూసుకోవాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున అనవసర వ్యయాలను తగ్గించడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

కర్కాటకరాశి

ఈ రోజు మీ ఆలోచనలు సరైన దిశలో సాగుతాయి. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు ముందుకు కదులుతాయి. ఆస్తి కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన ఒప్పందాలు పూర్తయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు ఇది అనుకూలమైన సమయం.

సింహరాశి

ఈ రోజు అదృష్టం మీవైపు ఉంటుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్ లేదా బాధ్యతల పెంపుకు సంబంధించిన శుభవార్తలు అందవచ్చు. వివాదాలు సద్దుమణుగుతాయి. అదనపు ఆదాయం కోసం చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి.

కన్యారాశి

కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఇంటి నిర్మాణం లేదా స్థిరాస్తికి సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తారు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.

తులారాశి

ఈ రోజు మీరు చేపట్టిన పనులు సమయానికి పూర్తవుతాయి. భూమి, వాహనాల కొనుగోలు విషయంలో శుభయోగం ఉంది. ఉద్యోగాల్లో ఉన్నవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు దక్కుతాయి. అదనపు ఆదాయం కోసం చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఆనందకరమైన వార్తలు వినే అవకాశం ఉంది.

వృశ్చికరాశి

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. అయితే కొన్ని పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.

ధనస్సురాశి

ఈ రోజు కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి మంచి సమయం. వ్యాపార విస్తరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. ప్రయాణాలు కూడా అనుకూల ఫలితాలను ఇస్తాయి.

మకరరాశి

సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. స్నేహితులు, బంధువుల సహకారం అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. పట్టుదలతో చేసిన ప్రతి ప్రయత్నం విజయవంతమవుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

కుంభరాశి

రుణాల భారాన్ని తగ్గించే అవకాశాలు కనిపిస్తాయి. వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రముఖులను కలుసుకునే అవకాశం లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి.

మీనరాశి

ఈ రోజు అన్ని రంగాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు వస్తాయి. కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి ఇది శుభసమయం. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. దేవుని అనుగ్రహంతో చేపట్టిన పనులు విజయవంతమవుతాయి.

గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన ఫలితాలు మాత్రమే. పూర్తిస్థాయి వ్యక్తిగత జాతకం కోసం నిపుణులైన జ్యోతిష్యపండితులను సంప్రదించండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu