Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Daily Horoscope:  ప్రయాణాలు కలిసిరావు...ఈరెండు రాశులదే అదృష్టం

Daily Horoscope: ప్రయాణాలు కలిసిరావు...ఈరెండు రాశులదే అదృష్టం

hmtv 3 weeks ago

Daily Horoscope: మే 5, 2026, మంగళవారం నాడు ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన వైశాఖ మాస బహుళ పక్ష చతుర్థి తిథి ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మధ్యాహ్నం 12:55 వరకు జ్యేష్ఠ నక్షత్రం ప్రభావం ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి మానసిక ఉద్వేగాలు అధికంగా ఉంటాయి.

ఆ తదుపరి మూల నక్షత్రం ప్రవేశించడంతో పనుల్లో వేగం పుంజుకుంటుంది. శివ యోగం, బవ కరణాల కలయిక వల్ల ఈ రోజు దైవారాధనకు, కొత్త నిర్ణయాలకు శుభప్రదంగా ఉంటుంది.

మేషరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఆశించిన విజయాలు దక్కుతాయి. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ఉద్యోగస్తుల పనితీరును పై ఉద్యోగులు మెచ్చుకుంటారు. గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈరోజు ఈరాశివారు నవగ్రహ శ్లోకాలు పఠించడం ద్వారా రాబోయే చిన్న చిన్న ఆటంకాలను సులభంగా దాటవచ్చు

వృషభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. వృత్తి పరంగా గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలకు ఈ రోజు స్వస్తి లభిస్తుంది. ఖర్చుల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. సంతానానికి సంబందించి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఈరోజు ఈరాశివారు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల మనశ్శాంతి, కార్యసిద్ధి కలుగుతాయి.

మిథునరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. నిగ్రహంతో వ్యవహరించాలి. అధికారులతో మాట్లాడేటప్పుడు మౌనం పాటించడం ఉత్తమం. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఈరోజు ఈరాశివారు ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది.

కర్కాటకరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ, మీ పట్టుదల మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, లేదంటే కుటుంబంలో ఇబ్బందులు రావచ్చు. పట్టుదలతో ముందుకు సాగుతారు. ఈరోజు ఈరాశివారు గురు దక్షిణామూర్తి ధ్యానం మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది.

సింహరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. కళాకారులకు, సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఈ రోజు ఒక వరం లాంటిది. మీ ప్రతిభకు తగిన అవకాశాలు తలుపు తడతాయి. ఆర్థికంగా ఈ రోజు అనుకూలత కనిపిస్తోంది. ఈరోజు ఈరాశివారు కులదైవారాధన చేయాలి.

కన్యారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. పనుల్లో జాప్యం జరిగినా, చివరి నిమిషంలో విజయం మీదే అవుతుంది. వ్యాపారస్తులు బుద్ధిబలంతో చేసే నిర్ణయాలు భారీ లాభాలను తెచ్చిపెడతాయి. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈరోజు ఈరాశివారు చేసే హనుమ ఆరాధన రక్షణ కవచంలా పనిచేస్తుంది.

తులారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అదృష్టం మీ వెంటే ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరిగే సూచనలు బలంగా ఉన్నాయి. సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది. సమయాన్ని వృథా చేయకండి. ఈరోజు ఈరాశివారు హనుమాన్‌ చాలీసా పారాయణ చేయాలి.

వృశ్చికరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మద్దతుతో మీరు అసాధ్యమనుకున్న పనులను సుసాధ్యం చేస్తారు. సాయంత్రం వేళ ఒక శుభవార్త మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఈరోజు ఈరాశివారికి లక్ష్మీ దేవి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.

ధనస్సురాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు సామాన్యంగా ఉన్నాయి. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే దూర ప్రయాణాలు వాయిదా వేయండి. అపరిచితులతో ఆర్థిక లావాదేవీలు చేయకూడదు. ఈరోజు ఈరాశారు శని దోష నివారణ శ్లోకాలు పఠించడం వల్ల ఈ రోజు గండాల నుంచి గట్టెక్కవచ్చు.

మకరరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మనోబలమే మీ బలహీనతను పోగొడుతుంది. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన మీకు కొత్త శక్తిని ఇస్తుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఈరోజు ఈరాశివారు శ్రీలక్ష్మి గణపతి ఆలయాన్ని సందర్శించడం శుభప్రదం.

కుంభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు పట్టాభిషేకం జరుగుతుంది. ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో మాత్రం అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం అవసరం. శుభవార్తలు వింటారు. ఈరోజు ఈరాశివారు శివారాధన చేయాలి.

మీనరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు. ఆదాయం పెరిగినా, సమానంగా ఖర్చులు కూడా ఉంటాయి. బంధువులతో సంభాషించేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. సహనం చాలా అవసరం. ఈరోజు ఈరాశివారు సూర్యుడిని ఆరాధించాలి.

గమనికః ఇక్కడ ఇచ్చిన రాశిఫలితాలు సామాన్యమైనవి. వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి కాదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu