Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Daily Horoscope: రాశిఫలాలు - ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే

Daily Horoscope: రాశిఫలాలు - ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే

hmtv 3 days ago

Daily Horoscope: కృష్ణపక్ష విదిత తిథిలో వచ్చిన ఈ మంగళవారానికి ఆధ్యాత్మికంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. మూల నక్షత్రం, సాధ్యయోగం ప్రభావం కొన్ని రాశులపై తీవ్రమైన మార్పులు తీసుకురానున్నాయి.

అదేవిధంగా దైవనామస్మరణతో, భగవంతుని సన్నిధిలో గడిపేవారికి ఈరోజు దివ్యంగా ఉంటుంది. మరి అధిక జ్యేష్టమాసంలోని కృష్ణ పక్ష విదియ రోజున ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు సామాన్యంగా ఉన్నాయి. ఉద్యోగ, వృత్తి రంగాల్లో అధికారులతో వ్యవహరించేటప్పుడు సంయమనం అవసరం. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉన్నప్పటికీ అనవసర ఖర్చులను తగ్గించడం మంచిది. ఈరోజు ఈరాశివారు అంగారక గ్రహ ఆరాధన చేయాలి.

వృషభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. నూతన వ్యాపారాలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈరాశివారు హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించాలి.

మిథునరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారంలో ఊహించని ధనలాభాలు ఉంటాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఈరాశివారు సూర్యుడిని ఆరాధించాలి.

కర్కాటకరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. పనులు సమయానికి పూర్తిచేస్తారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా సాగుతాయి. జీవిత భాగస్వామితో ఉన్న పాత గొడవలు సర్దుకుపోతాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు ఈరాశివారు శ్రీమహాలక్ష్మిని ఆరాధించాలి.

సింహరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మీ తెలివితేటలతో కోర్టు లేదా ఆస్తికి సంబంధించిన కీలక సమస్యలను పరిష్కరిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే సూచనలు ఉన్నాయి. వృథా ఖర్చులు తగ్గించుకుంటే ఆర్థిక స్థిరత్వం వస్తుంది. ఈరోజు ఈరాశివారు సుబ్రహ్మణ్యుడిని ఆరాధించాలి.

కన్యారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఉద్యోగంలో తాత్కాలిక మార్పులు ఆందోళన కలిగిస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు, స్థిరాస్తి కొనుగోలు విషయంలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఈరాశివారు శ్రీమహాలక్ష్మిని ఆరాధించాలి.

తులారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారంలో మీరు తీసుకునే క్రమశిక్షణతో కూడిన నిర్ణయం భవిష్యత్తులో పెద్ద లాభాలను తెచ్చిపెడుతుంది. బంధువుల సహాయంతో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఈరోజు ఈరాశివారు సిద్ధి వినాయకుడిని ఆరాధించాలి.

వృశ్చికరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనా మీ మనోధైర్యంతో అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ పెద్దల సలహాలు పాటించండి. ఈరోజు ఈరాశివారు పంచముఖ హనుమంతుడిని ఆరాధించాలి.

ధనస్సురాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. పిత్రార్జితం లేదా పాత ఆస్తుల ద్వారా ధనలాభం కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఇంట్లో పెళ్లి లేదా శుభకార్యం గురించిన చర్చలు మొదలవుతాయి. ఈరోజు ఈరాశివారు కులదేవతారాధన చేయడం శ్రేయస్కరం.

మకరరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు సామాన్యంగా ఉన్నాయి. చంచల స్వభావం వల్ల కొన్ని మంచి అవకాశాలను చేజార్చుకుంటారు. చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. కోర్టు వ్యవహారాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఈరోజు ఈరాశివారు నవగ్రహారాధన చేయాలి.

కుంభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. గతంలో ఉన్న అప్పులు తీరిపోవడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఈరాశివారు లక్ష్మీకుబేరుడిని ఆరాధించాలి.

మీనరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అవివాహితులకు పెళ్లి కుదురుతుంది. సమాజంలో పెద్దల మద్దతు లభిస్తుంది. బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుంది. ఈరోజు ఈరాశివారు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ఉత్తమం.

గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన ఫలితాలు మాత్రమే. ఎవరి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఇచ్చినవి కావు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu