Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Daily Horoscope: సుకర్మయోగంతో ఈ రాశుల జాతకాలు ఎలా మారుతున్నాయంటే

Daily Horoscope: సుకర్మయోగంతో ఈ రాశుల జాతకాలు ఎలా మారుతున్నాయంటే

hmtv 6 days ago

Daily Horoscope: ఈ రోజు అధిక జ్యేష్ఠ మాస శుక్ల పక్ష విదియ. ఉదయం నుంచి రోహిణి నక్షత్ర ప్రభావం ఉండగా, తర్వాత మృగశీర్ష నక్షత్ర ప్రవేశం జరుగుతుంది.

సుకర్మ యోగం కారణంగా చాలా రాశుల వారికి పనుల్లో పురోగతి కనిపించనుంది. ముఖ్యంగా కుటుంబ నిర్ణయాలు, ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగ మార్పులు, వ్యాపార విస్తరణల విషయంలో ఈ రోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపించే అవకాశముంది. కొందరికి అదృష్టం కలిసివస్తే, మరికొందరు ఓర్పు పాటించాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటారు. గ్రహస్థితుల ప్రభావంతో ఏ రాశివారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం.

మేషరాశి

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపు లభించినా, చిన్న చిన్న ఆటంకాలు మానసిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాల విషయంలో తొందరపడకపోవడం మంచిది. కుటుంబ సభ్యుల సలహాలు ఈ రోజు ఎంతో ఉపయోగపడతాయి. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా విలాస వస్తువులపై ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఈరోజు ఈరాశివారు దత్తాత్రేయుడిని ఆరాధించాలి.

వృషభరాశి

ఈ రోజు వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృత్తి జీవితంలో ముందడుగు పడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారులు ప్రశంసలు అందిస్తారు. వ్యాపారాల్లో లాభదాయకమైన అవకాశాలు ఎదురవుతాయి. భూమి, ఇల్లు, వాహనం వంటి విషయాల్లో శుభసూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఈరోజు ఈరాశివారు శ్రీమహా విష్ణువును ఆరాధించాలి.

మిథునరాశి

మిథున రాశి వారు ఈ రోజు మాట్లాడే మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. నోటి దురుసుతనం వలన వివాదాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పనిభారం పెరిగినా, మీ తెలివితో సమయానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆదాయం సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో అపార్థాలు రాకుండా ఓర్పుతో వ్యవహరించడం అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు ఈరాశివారు శివుడిని ఆరాధించడం మంచిది.

కర్కాటకరాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు సంతోషకరంగా ఉంటుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన పని పూర్తి అవుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లేదా గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కొంత ధన వ్యయం ఉన్నప్పటికీ అది అవసరమైన పనులకే జరుగుతుంది. ఈరోజు ఈరాశివారు శక్తిని ఆరాధించాలి.

సింహరాశి

సింహ రాశి వారికి ఈ రోజు అధికారయోగం బలంగా ఉంది. ఉద్యోగంలో మీ ప్రతిభ ప్రత్యేకంగా కనిపిస్తుంది. కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారస్తులకు లాభాలు కనిపిస్తున్నాయి. పెద్ద మొత్తంలో ధనం చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో కలిసి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఈరాశివారు కులదైవారాధన చేయడం మంచిది.

కన్యారాశి

కన్య రాశి వారు ఈ రోజు శాంతంగా ఉండడం చాలా అవసరం. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది. ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబంలో చిన్న చిన్న విషయాలకే ఉద్రిక్తతలు రావచ్చు. బంధువులతో మాటల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్య పరంగా బలహీనత కనిపించవచ్చు. ఈరోజు ఈరాశివారు సూర్యుడిని ఆరాధించాలి.

తులారాశి

తుల రాశి వారికి ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో లాభాలు కనిపిస్తున్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఈరోజు ఈరాశివారు కార్యసిద్ధి హనుమాన్‌ దర్శనం చేసుకోవడం వలన మానసిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.

వృశ్చికరాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఓర్పు అవసరం. ఉద్యోగంలో చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గించుకోవడం మంచిది. ఒక వార్త మనసును బాధించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం మిమ్మల్ని నిలబెడుతుంది. ఈరోజు ఈరాశివారు పంచముఖ ఆంజనేయుడిని దర్శించుకోవాలి

ధనస్సురాశి

ధనుస్సు రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. తలపెట్టిన పనులు ఆలస్యంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఉద్యోగంలో ఓర్పుతో ముందుకు సాగాలి. కుటుంబ విషయాల్లో ముందుచూపు అవసరం. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఈరోజు ఈరాశివారు గణపతి ఆరాధన చేయడం శ్రేయస్కరం.

మకరరాశి

మకర రాశి వారికి ఈ రోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. చేసిన పనికి తగిన ఫలితం ఆలస్యంగా రావచ్చు. ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. ఖర్చులను అదుపులో ఉంచకపోతే ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఈరోజు ఈరాశివారు శనిగ్రహ ఆరాధన చేయాలి.

కుంభరాశి

కుంభ రాశి వారికి ఈ రోజు ధర్మబలం ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మేలు చేస్తాయి. ఉద్యోగంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడం వల్ల విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమిస్తారు. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఈరాశివారు శ్రీమహాలక్ష్మిని ఆరాధించాలి.

మీనరాశి

మీనం రాశి వారికి ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. శుభకార్యాలపై చర్చలు ప్రారంభమవుతాయి. ఆర్థికంగా బలపడతారు. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఈరోజు ఈరాశివారు దక్షిణామూర్తిని ఆరాధించాలి.

గమనికః ఇక్కడ ఇచ్చిన రాశుల ఫలితాలు ఎవరి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఇచ్చినవి కాదు. వ్యక్తిగత జాతక ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu