Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Daily Horoscope: వైశాఖ పూర్ణిమ రోజున అదృష్టవంతమైన రాశులు ఇవే

Daily Horoscope: వైశాఖ పూర్ణిమ రోజున అదృష్టవంతమైన రాశులు ఇవే

hmtv 0 months ago

Daily Horoscope: వైశాఖమాసంలో అత్యంత శుభప్రదమైన రోజు వైశాఖ పూర్ణిమ. వైశాఖమాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనదిగా కూడా చెబుతారు. కాగా, ఈరోజు చంద్రుడు తన పూర్తి కళతో ప్రకాశిస్తూ, భూమిపై సానుకూల శక్తిని ప్రసరింపజేస్తాడు.

ఆధ్యాత్మికంగా ఈరోజు జప, తప, దానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాదు, ఈరోజు స్వాతీ నక్షత్రం, సిద్దియోగం కలయిక వలన కొన్ని రాశులకు అద్భుతమైన యోగాలు పట్టనున్నాయి. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశిఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. పూర్ణిమ పురోగతిని ఇస్తుంది. ఉద్యోగంలో క్రమశిక్షణే మీ విజయరహస్యం. వ్యాపారస్తులు అనవసరపు రిస్కులు తీసుకోకుండా, ఉన్నదానిని కాపాడుకోవడం ఉత్తమం. ఆర్థికంగా పొదుపు మంత్రం పఠించాలి. ఈరోజు ఈరాశివారు హనుమాన్ చాలీసా పఠనం వల్ల మానసిక ధైర్యం లభిస్తుంది.

వృషభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. గ్రహబలం అద్భుతంగా ఉంది. మీరు ఏ పని తలపెట్టినా విజయం మీ వశమవుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా నూతన బాధ్యతలు వచ్చే సూచనలున్నాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలు లాభిస్తాయి. ఈ రోజు ఈరాశివారు మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోవడం వల్ల శుభం కలుగుతుంది.

మిథునరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. శని ప్రభావం వల్ల చిన్నపాటి ఆటంకాలు ఎదురవ్వవచ్చు. మాట తూలడం వల్ల ఇబ్బందులు రావచ్చు, కాబట్టి మౌనంగా ఉండటం మేలు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఈరోజు ఈరాశివారు శనిధ్యాన శ్లోకాలు పఠించడం వలన మేలు జరుగుతుంది.

కర్కాటకరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది కానీ కుటుంబంలో మాత్రం చిన్నపాటి ఒడిదుడుకులు తప్పవు. ఆర్థిక విషయాల్లో ఎవరినీ అతిగా నమ్మవద్దు. సహనం కోల్పోతే బంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈరోజు ఈరాశివారు మహాశివుడికి అభిషేకం చేయాలి.

సింహరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అన్నింటా విజయం లభిస్తుంది. పోటీదారులపై మీదే పైచేయి అవుతుంది. నూతన పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. విహారయాత్రలు ఉత్సాహాన్నిస్తాయి.ఈరోజు ఈరాశివారు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించాలి.

కన్యారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మీ వాక్చాతుర్యం ఈరోజు మీకు శ్రీరామరక్ష. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల చర్చలు జరుగుతాయి. ఆర్థికంగా ఎదగడానికి మార్గాలు సుగమం అవుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఈరోజు ఈరాశివారు కులదైవారాధన చేయాలి.

తులారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల మీ సంకల్ప బలం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక చింతనతో గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఈరాశివారు శ్రీమహావిష్ణువును ఆరాధించాలి.

వృశ్చికరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఆపదల నుంచి గట్టెక్కుతారు. ఆహార నియమాలు పాటించడం ముఖ్యం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పొదుపు చర్యలు తీసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఈరోజు ఈరాశివారు సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ధనస్సురాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. సంతాన పరంగా శుభవార్తలు వింటారు. మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఖర్చులు పెరిగినా ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వద్దు. ఈరోజు ఈరాశివారు ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

మకరరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నాయి. గ్రహ సంచారం కొంత ప్రతికూలంగా ఉంది. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. అనవసరపు గొడవలకు దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించాలి. రుణభారం, ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు ఈరాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి, సింధూర ధారణ చేయడం వల్ల ఆపదలు తొలగుతాయి.

కుంభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. అదృష్టం తలుపు తడుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా బలపడతారు. తెలివిగా వ్యవహరించి కీలక పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. ఈరోజు ఈరాశివారు గోవింద నామాలు స్మరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.

మీనరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఓర్పు వహించాల్సిన సమయం. తోటివారితో వాదనలకు దిగకండి. చేసే పనిలో ఏకాగ్రత ముఖ్యం. వ్యాపారంలో ముందుచూపుతో వ్యవహరించాలి. మొహమాటాలతో చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఈరోజు ఈరాశివారు నవగ్రహ ఆరాధన చేయడం వల్ల దోషాలు తొలగి, పనులు సజావుగా సాగుతాయి.

గమనికః ఇక్కడ ఇచ్చిన రాశి ఫలితాలు కేవలం సామాన్యమైనవి మాత్రమే. వ్యక్తిగత జాతకం అనుసరించి ఇచ్చినవి కాదు. పూర్తి వ్యక్తిగత జాతక ఫలితాల కోసం మీరు జ్యోతిష్యుడిని సంప్రదించాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu