Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Daulthabad: చాకలి ఐలమ్మ, శ్రీకాంతాచారి కుటుంబాలకు ఘన సత్కారం

Daulthabad: చాకలి ఐలమ్మ, శ్రీకాంతాచారి కుటుంబాలకు ఘన సత్కారం

hmtv 2 days ago

Daulthabad: చాకలి ఐలమ్మ, శ్రీకాంతాచారి కుటుంబాలకు ఘన సత్కారం

సిద్దిపేట జిల్లా: దౌల్తాబాద్ మండలంకు సంబంధించిన నాయకులు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేత, తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత చారి తల్లి శంకరమ్మలను హైదరాబాద్‌లోని బుద్ధ భవన్‌లో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి, స్వచ్ఛభారత్ పితామహుడు గాడ్గే బాబా జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబానికి, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు శ్రీకాంత చారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజా పోరాట యోధులు, ఉద్యమకారుల కుటుంబాలకు ప్రజా పాలనలో సముచిత స్థానం కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌లో బాధ్యతలు స్వీకరించడం ద్వారా మహిళల సంక్షేమం, సాధికారత సాధ్యం అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu