Daulthabad: మచిన్‌పల్లిలో పెద్దమ్మ తల్లి వార్షికోత్సవం.. పాల్గొన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి!
Daulthabad: దౌల్తాబాద్ మండలం మచిన్‌పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ పెద్దమ్మ తల్లి ప్రథమ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్న దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ఇట్టి కార్యక్రమంలో మచిన్ పల్లి గ్రామం సర్పంచ్ బొక్కల నాగరాజు, ఉమ్మడి దౌల్తాబాద్@రాయపోల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐలపురం కనకయ్య యాదవ్, వైస్ చైర్మన్ మద్దెల స్వామి, సర్పంచ్ అనురాధ రమేష్, రాయపోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తప్పట సుధాకర్ ముదిరాజ్, నాయకులు దుర్గా ప్రసాద్, సిద్ధ గౌడ్ బాలశేఖర్ రెడ్డి, మద్దెల మల్లేశ్, దుద్దెడ స్వామి, శివ లింగం, సోలిపేట ప్రసాద్ రెడ్డి, కోమటిరెడ్డి పద్మా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

