Deovanakonda: విద్యార్థి పోరాటాల నుండి డాక్టరేట్ శిఖరానికి
Deovanakonda: విద్యార్థి ఉద్యమాల నుండి డాక్టరేట్ దాకా ఎదిగిన మిత్రుడు ఎన్. మాధవకృష్ణ కు విప్లవ అభివందనాలు తెలియజేస్తున్నట్లు సీపీఐ మండల కార్యదర్శి ఎమ్..నరసరావు తెలిపారు.
బుధవారం దేవనకొండలో పాత్రికేయులతో మాట్లాడుతూ..
కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రానికి చెందిన ఎన్. మాధవ్ తన విద్యార్థి దశ నుండి విద్యారంగ సమస్యలపై పోరాడుతూ. మరోవైపు చదువు పట్ల అంకితభావం, నిరంతర కృషి, పట్టుదలతో డాక్టరేట్ పట్టా అందుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారని గర్వించదగ్గ విషయమన్నారు.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నందు రాజనీతి శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ బి. వి. మురళీధర్ పర్యవేక్షణలో "ది ఫంక్షనింగ్ ఆఫ్ సెకండరీ స్కూల్స్ అండర్ జిల్లా పరిషత్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్" అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్ పొందారని పేర్కొన్నారు. విద్యా రంగంలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు, సమస్యలు, సవాళ్లు, అభివృద్ధి అవకాశాలపై చేసిన ఈ పరిశోధన ప్రాముఖ్యత సంతరించుకుందన్నారు.
దేవనకొండ మండల కేంద్రంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) విద్యార్థి సంఘం నందు మొట్టమొదటిసారిగా సభ్యత్వం పొంది ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శిగా, జిల్లా సమితి సభ్యులుగా, కర్నూలు నగర కార్యదర్శిగా, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యునిగా అత్యున్నత పదవులు పొంది విద్యార్థి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడం జరిగిందన్నారు.
మండలంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఉద్యమాలు నిర్వహించడం జరిగిందన్నారు. డిఎన్టి హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం, జూనియర్ కళాశాలకు సొంత భవనాల నిర్మాణం కోసం, మండలంలో అణగారిన వర్గాల విద్యార్థులకు స్కాలర్షిప్ల సాధన కోసం కృషి చేశారని కొనియాడారు. నిరంతరం విద్యార్థి హక్కుల సాధన కోసం పాటుపడడం జరిగిందన్నారు. అంతేగాక
మాధవ్ గారు గత 15 సంవత్సరాలుగా విద్యార్థి నాయకుడిగా చురుకుగా పనిచేస్తూ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారని తెలిపారు.అలాగే స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏడు సంవత్సరాల పాటు పనిచేసి ఫీజుల సమస్యలు, హాస్టల్ సమస్యలు, స్కాలర్‌షిప్‌లు, విద్యా సదుపాయాల కల్పన, ప్రభుత్వ విద్యా పరిరక్షణ వంటి అనేక అంశాలపై నిరంతరం పోరాడారని తెలిపారు.
అంతేకాకుండా జిల్లాలో వామపక్ష విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించి, అనేక మంది విద్యార్థి నాయకులను తీర్చిదిద్దిన నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందడం గర్వించదగ్గ విషయమన్నారు. పోరాటాల మధ్యే విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్ సాధించడం విశేషమన్నారు.
మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఒక పోరాట నాయకుడు అకాడమిక్ శిఖరాన్ని అధిరోహించడం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోందన్నారు. ఈసందర్భంగా వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, వామపక్ష రాజకీయ పార్టీల నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు మాధవ్ గారిని ఘనంగా అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

