Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Devanakonda:సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ సిపిఐ వాల్ పోస్టర్లు ఆవిష్కరణ!

Devanakonda:సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ సిపిఐ వాల్ పోస్టర్లు ఆవిష్కరణ!

hmtv 2 weeks ago

Devanakonda:సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ సిపిఐ వాల్ పోస్టర్లు ఆవిష్కరణ!

దేవనకొండ: 12 సంవత్సరాల బిజెపి పరిపాలన కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడంతో మార్పు కావాలి అనే నినాదంతో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఆగస్టు 6 నుండి 15 జరిగే పాదయాత్రాలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే.

మద్దిలేటి శెట్టి, సిపిఐ మండల కార్యదర్శి ఎం. నరసరావు లు పిలుపునిచ్చారు. బుధవారం నాడు దేవనకొండ ఎమ్మార్వో కార్యాలయ ప్రాంగణం నందు చలో ఢిల్లీ వాల్ పోస్టర్లు విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బిజెపి పరిపాలన కాలంలో ప్రజల మధ్య మతాల పేరుతో చిచ్చు పెడుతూ అభివృద్ధిని విస్మరించిందని ప్రశ్నించే వారిని దేశద్రోహులంటూ నిర్బంధాలకు గురి చేస్తుందని, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ నియంతృత్వంగా వ్యవహరిస్తుందని వీరి పాలన కాలంలో దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రస్థాయిలో పెరిగిపోవడమే కాకుండా పరీక్ష పత్రాల లీకులతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని, మహిళలకి ఆదివాసులకి రక్షణ లేకుండా పోయిందని ఇలాంటి తరుణంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో

ప్రజలలో చైతన్యం పెంచి మార్పు కావాలి అనే నినాదంతో ఆగస్టు 6 నుండి 15 వరకు జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ఎల్ లినో ప్రభావం వల్ల జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడకపోవడం వల్ల వేసిన పంటలు భూమిలోనే పోయి రైతులు అప్పుల్లో కూరుకుపోయినరని కావున కర్నూలు జిల్లాలో కరువు జిల్లాగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని, ప్రతి రైతుకు నష్టపరిహారం 50 వేల రూపాయలు ఇవ్వాలని, రైతులు బ్యాంకులో తీసుకున్న అప్పులు మొత్తం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18వ తేదీన వేలాది మంది రైతులతో కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేయడం జరుగుతుందని,

సెప్టెంబర్ 1వ తేదీన చలో ఢిల్లీ నిర్వహిస్తున్నామని వారు తెలియజేశారు.

ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. సమావేశంలో ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు తిమ్మప్ప కొండప్ప సిపిఐ మండల నాయకులు కృష్ణ, వీరాంజనేయులు, శ్రీనివాసులు, రామాంజనేయులు, రఫీ, లక్ష్మన్న, సుంకన్న ,బజారే, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu