Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Devarakadra: రైతు బిడ్డ.. ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది!

Devarakadra: రైతు బిడ్డ.. ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది!

hmtv 2 weeks ago

Devarakadra: రైతు బిడ్డ.. ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది!

దేవరకద్ర: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉధ్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రైతు వారోత్సవాల నియోజకవర్గ సభ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జి.

మధుసూదన్ రెడ్డి. రైతులు ఏర్పాటుచేసిన కూరగాయలు, పండ్లు, పామాయిల్ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, రైతులు పండిస్తున్న పంటలపై వారికి సరైన అవగాహన కల్పించే విధంగా, ప్రతి రైతు పంట మార్పిడికి ముందుకు రావాలని, ఏ పంటలు వేస్తే లాభాలు వస్తాయో శాస్త్రవేత్తలతో పాటు జిల్లా హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులతో వారికి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు.

కమర్షియల్ క్రాప్స్ వేయడం వల్ల రైతులకు లాభాలు చేకూరుతాయని తెలిపారు. ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు. వేసిన పంటనే మళ్ళీ వేస్తే నేల సారవంతం కోల్పోతుందని అందుచే పంట మార్పిడి చేయాలని, నేల స్వభావాన్ని బట్టి ఏ నెలలో ఏ పంటలు వేస్తే లాభాలు వస్తాయో శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ కు సబ్సిడీ ఇస్తున్నామన్నారు.

ఆయిల్ పామ్ పంటలు, పప్పు దినుసులు, కూరగాయలు, వివిధ రకాల పండ్ల తోటలు తదితర పంటలు మార్పిడి చేస్తూ పండించాలని రైతులను కోరారు. రైతులు పండించిన పంటలు చివరి గింజ వరకు ప్రభుత్వం రైతుల నుండి కొని బోనస్ కూడా అందజేస్తుందని, రైతులెవ్వరు అధైర్య పడొద్దని ఈ సందర్భంగా తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక రైతు బిడ్డే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu