Devarakadra: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి
Devarakadra: దేవరకద్ర నియోజకవర్గ రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 50% సబ్సిడీతో రైతులకు పచ్చి రొట్టె విత్తనాలు, జీలుగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి.
మధుసూదన్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు, గత ప్రభుత్వం రైతుబంధు నెపంతో రైతులకు ఇచ్చే అన్ని సబ్సిడీలను ఎగ్గొట్టిందని తెలిపారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీ, సబ్సిడీపై విత్తనాల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర మున్సిపల్ చైర్మన్ కొండ దమయంతి గోవర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్ యుగంధర్ రెడ్డి,దేవరకద్ర కౌకుంట్ల మండలాల అధ్యక్షులు అంజిల్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, ఏవో రాజేందర్ అగర్వాల్, ఎంపీడీవో శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

