Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Dharmajipeta: ధర్మాజీపేటలో ఘనంగా 'బడిబాట'.. ప్రభుత్వ పాఠశాలలే విద్యార్థుల భవిష్యత్తుకు వేదిక!

Dharmajipeta: ధర్మాజీపేటలో ఘనంగా 'బడిబాట'.. ప్రభుత్వ పాఠశాలలే విద్యార్థుల భవిష్యత్తుకు వేదిక!

hmtv 1 week ago

Dharmajipeta: ధర్మాజీపేటలో ఘనంగా 'బడిబాట'.. ప్రభుత్వ పాఠశాలలే విద్యార్థుల భవిష్యత్తుకు వేదిక!

దుబ్బాక: ప్రజాపాలన ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యచరణ వారోత్సవాలలో భాగంగా ....తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట వార్డులో బాలబాలికలు ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలని అవగాహన కల్పిస్తూ ధర్మాజీపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో మన పాఠశాల - మన బాధ్యత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా *దుబ్బాక మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ వనం రమేష్

ధర్మాజీపేట బడి బాట ర్యాలీలో భాగంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ విద్య, క్రీడలు మరియు ఇతర సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలలే ఉత్తమ వేదిక అని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu