Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Dharmavaram: నిజాలు చెప్పిన మంత్రి సత్య కుమార్

Dharmavaram: నిజాలు చెప్పిన మంత్రి సత్య కుమార్

hmtv 1 week ago

ర్మవరం: పట్టణంలో నేడు స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మున్సిపల్ ఉద్యోగులు మెప్మా సంఘం సభ్యులు సచివాలయ ఉద్యోగులతో కలిసి ప్లకార్డులు పట్టుకొని మంత్రి,కలెక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. కళా జ్యోతి సర్కిల్ లో ఉన్న హోటల్లు,బేకరీ పూలు పళ్ళు అమ్మే తోపుడు బండ్ల వద్దకు వెళ్లి సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ వలన పర్యావరణానికి కలిగే హాని గురించి అవగాహన కల్పించారు.

ప్లాస్టిక్ కవర్లు భూమిలో కలిసిపోవడానికి 20 సంవత్సరాలు పడుతుందని పైగా పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుందని మంత్రి వివరించారు.ఆంధ్రప్రదేశ్ ను ప్లాస్టిక్ రహిత సమాజంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు.ధర్మవరం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu