Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Divorce: విడాకులు తీసుకున్న మరో హీరోయిన్.. అతనితో ఉండలేనంటూ

Divorce: విడాకులు తీసుకున్న మరో హీరోయిన్.. అతనితో ఉండలేనంటూ

hmtv 1 week ago

Divorce: విడాకులు తీసుకున్న మరో హీరోయిన్.. అతనితో ఉండలేనంటూ

Mouni Roy: సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా సెలబ్రిటీల పెళ్లిళ్లు, విడాకుల విషయాలు సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్‌గానే ఉంటాయి.

తాజాగా బాలీవుడ్ అందాల నటి, 'నాగిని' ఫేమ్ మౌనీ రాయ్ తన వ్యక్తిగత జీవితం గురించి షాకింగ్ ప్రకటన చేసి అభిమానులను విస్మయానికి గురిచేశారు. గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలనే నిజం చేస్తూ, తన భర్త సూరజ్ నంబియార్‌తో విడిపోతున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు.

ట్విస్టుల మధ్య విడాకుల ప్రకటన

మౌనీ రాయ్ విడాకుల వ్యవహారం ఒక హైడ్రామాను తలపించింది. మొదట ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పెళ్లి ఫోటోలను తొలగించడంతో నెటిజన్లలో అనుమానాలు మొదలయ్యాయి. అయితే, ఆ వెంటనే స్పందించిన మౌనీ.. రూమర్లను నమ్మవద్దు, అసత్య ప్రచారాలు చేయకండి అంటూ గట్టిగానే బదులిచ్చారు. కానీ, ఆశ్చర్యకరంగా ఆ పోస్ట్ చేసిన 24 గంటలు కూడా గడవకముందే, తాము విడిపోతున్నట్లు తన భర్తతో కలిసి సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.

తమ నాలుగేళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు చెబుతూ మౌనీ రాయ్ ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. కొన్ని మీడియా వర్గాలు మా వ్యక్తిగత జీవితాల్లో అతిగా జోక్యం చేసుకోవడాన్ని మేము ఖండిస్తున్నాం. పరస్పర అవగాహనతో, మారుతున్న మా ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని విడివిడిగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. బయట ప్రచారమవుతున్న కల్పిత కథలకు, మా మధ్య ఉన్న యదార్థానికి ఎటువంటి సంబంధం లేదు. భవిష్యత్తులో కూడా మా మధ్య స్నేహాన్ని గౌరవిస్తాం. ఈ క్లిష్ట సమయంలో మా గోప్యతను గౌరవించాలని కోరుతున్నాం.

మౌనీ రాయ్, బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను 2022 జనవరి 27న గోవాలో వివాహం చేసుకున్నారు. మలయాళీ , బెంగాలీ సంప్రదాయాల్లో జరిగిన వీరి వివాహ వేడుకలు అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. దుబాయ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా ఉన్న సూరజ్‌తో మౌనీ జీవితం ఎంతో సంతోషంగా సాగుతుందని అందరూ భావించారు. కానీ, రెండేళ్లకే వీరి బంధంలో మనస్పర్థలు రావడం, ఇప్పుడు అది విడాకుల వరకు వెళ్లడం అభిమానులను కలచివేస్తోంది.

తెలుగు ప్రేక్షకులకు కూడా 'నాగిని' సీరియల్ ద్వారా సుపరిచితురాలైన మౌనీ రాయ్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు కెరీర్ పరంగా దూసుకుపోతున్నా, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఈ ఒడిదుడుకులు ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి. ఏది ఏమైనా, ఒక అందమైన జంట ఇలా విడిపోవడం సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu