Dubbaka: దుబ్బాకలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ 138వ జయంతి
దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని లచ్చపేట వార్డులో ఆది హిందూ ఉద్యమ నిర్మాత, అణగారిన వర్గాల ఆత్మగౌరవ పోరాటయోధుడు, మహోన్నత సంఘసంస్కర్త భాగ్యరెడ్డి వర్మ గారి 138వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయన సమాజ సేవలను, అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ MRPS వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్, తిమ్మాపూర్ సర్పంచ్, రాష్ట్ర కన్జ్యూమర్ అసోసియేషన్ అధ్యక్షులు కుంభాల రవి, జాతీయ అంబేద్కర్ అవార్డు గ్రహీత దళిత రత్న ఆసముత్యం, సీనియర్ BRS నాయకులు సంఘం ప్రభాకర్ ముదిరాజ్ తదితరులు హాజరయ్యారు. అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, భాగ్యరెడ్డి వర్మ సమాజంలో అణచివేతకు గురైన వర్గాల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడని కొనియాడారు.

