Dubbaka: దుబ్బాకలో రచ్చ.. ఎమ్మెల్యే తీరుపై టీపీసీసీ నేత తీవ్ర ఆగ్రహం!
సిద్దిపేట జిల్లా: దుబ్బాక నియోజకవర్గం కేంద్రంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రవర్తనపై టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి గణేష్ పంచమి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు పార్టీ కండువాలు ధరించి కార్యకర్తలను తీసుకువెళ్లడం మాత్రమే కాకుండా, వీధి రౌడీలా ప్రవర్తించడం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు. ప్రజా ప్రతినిధిగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే సభలో అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కొత్త ప్రభాకర్ రెడ్డికి అలవాటైందని ఆరోపించారు. వడ్లు కొనడం లేదని విమర్శలు చేస్తున్న ఆయన, గతంలో "వరి వేస్తే ఉరి" అన్న కేసీఆర్ పాలనను గుర్తు చేసుకోవాలని ఎద్దేవా చేశారు.

