Dubbaka: దుబ్బాకలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం
దుబ్బాక: తెలంగాణ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాల పెంపుపై సంతోసిస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక స్థానిక బస్టాండ్ ముందు సీఎం రేవంత్ రెడ్డి,ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వెంకటస్వామి చిత్రపటాలకు పాలబిషేకం చేశారు కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు శుభవార్త అందిస్తూ, కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవటం చాలా సంతోషకరమైన విషయమని ఈ పెరిగిన కనీస వేతనాలు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కార్మికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.కార్మిక సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం అన్నారు.

