Dubbaka: రామాలయం అభివృద్ధికి నిధులివ్వండి.. మంత్రి వివేక్‌కు వినతి
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలో వెలిసిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం, అలాగే సిసి (CC) రోడ్డు పనులకు నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు కొట్టె స్వామి కోరారు. హైదరాబాద్‌లోని నివాసంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు.
వినతిపత్రంపై మంత్రి వివేక్ వెంకటస్వామి సానుకూలంగా స్పందించారు. రామక్కపేట రామాలయం దేవస్థాన ప్రహరీ గోడ, సిసి పనులకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకుడు గడీల జనార్దన్ రెడ్డితో కలిసి కొట్టె స్వామి మంత్రి వివేక్ వెంకటస్వామిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, స్వామి రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.

