దువ్వూరు: కడప జిల్లా మైదుకూరు ఉద్యాన అధికారి సి రామకృష్ణ గారు దువ్వూరు మండలం లోని చిన్న సింగంపల్లి, మదిరేపల్లి టి.చల్లబసాయపల్లి గ్రామాల్లో 2026 ఖరీఫ్ లో పెద్ద బళ్ళారి ఉల్లి సాగును తగ్గించుకోవలసినదిగా తెలియజేశారు.
ఒకే పంట కాకుండా పసుపు, అరటి, కూరగాయలు, పూల మొక్కలు కూడా సాగు చేసుకోవాలని సూచించడమైనది. ఉల్లి పంట లో ఎత్తు మడుల పద్ధతి గురించి మరియు బిందు సేద్యం ప్రాముఖ్యతను గురించి తెలియజేయడమైనది.
ఉల్లి వేసుకునే రైతులు బొప్పాయి మరియు కొత్తగా నాటిన పండ్ల తోటల్లో ఉల్లిని అంతర పంటగా సాగు చేసుకోవాలని సూచించారు. కేపీ ఉల్లి పంటను (ఎగుమతి రకం) సంక్రాంతి పండగలోపు కోతకు వచ్చేట్లు వేసుకోవాలని తెలియపరచడమైనది. ఉల్లి పంటలో వేసుకొనే ఎరువులు గురించి మరియు సస్య రక్షణ గురించి వివరించారు ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్ర సిబ్బంది సూర్య నరసింహులు, సుప్రియ, రైతులు పాల్గొన్నారు.

