Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
E20 Petrol: మైలేజీ, ఇంజిన్ డ్యామేజ్ విషయాల్లో E20 పెట్రోల్‌పై అనుమానాలు.. కేంద్రం క్లారిటీ..

E20 Petrol: మైలేజీ, ఇంజిన్ డ్యామేజ్ విషయాల్లో E20 పెట్రోల్‌పై అనుమానాలు.. కేంద్రం క్లారిటీ..

hmtv 1 week ago

E20 Petrol: మైలేజీ, ఇంజిన్ డ్యామేజ్ విషయాల్లో E20 పెట్రోల్‌పై అనుమానాలు.. కేంద్రం క్లారిటీ..

E20 Petrol: ఇటీవల కాలంలో E20(20 శాతం ఇథనాల్ కలిపిన) పెట్రోల్ వాడటం వల్ల వాహనాల ఇంజిన్లు త్వరగా పాడైపోతున్నాయని, అలాగే మైలేజ్ దారుణంగా పడిపోతోందని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

అలాగే ఈ పెట్రోల్‌లో షుగర్ కంటెంట్ ఉండటం వల్ల వాహనాల ట్యాంకుల దగ్గరకు చీమలు, కీటకాలు భారీగా చేరుతున్నాయంటూ కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ అనుమానాలన్నింటిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చింది.

E20 పెట్రోల్ వాడకంపై వస్తున్న ఈ వార్తలను ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. ఈ E20 పెట్రోల్ వినియోగానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీలో ముఖ్యమైన విషయాలు ఇవే.

మైలేజ్ ఇంపాక్ట్: E20 పెట్రోల్ వాడకం వల్ల వాహనాల మైలేజ్‌పై పడే ప్రభావం చాలా స్వల్పమని, దారుణంగా పడిపోతుందన్న వాదనలో నిజం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇంజిన్‌కు నష్టం లేదు: ఈ పెట్రోల్ వాడటం వల్ల ఇంజిన్‌కు గానీ, లేదా వాహనంలోని ఇతర భాగాలకు గానీ ఎలాంటి నష్టం జరగదని, E20 వల్లే అవి పాడైనట్లు ఎక్కడా శాస్త్రీయంగా తేలలేదని స్పష్టం చేసింది.

ఫేక్ వీడియోలు: ఇథనాల్‌లోని షుగర్ కారణంగా పెట్రోల్ ట్యాంక్ దగ్గరకు చీమలు, కీటకాలను ఎట్రాక్ట్ చేస్తున్నట్లు నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు పూర్తిగా ఫేక్ అని కొట్టిపారేసింది.

దేశానికి, రైతులకు మేలు: దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ వాడకం వల్ల ఏకంగా రూ.1.9 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు ఆదా అయ్యాయని ప్రభుత్వం వివరించింది. అలాగే, ఇథనాల్ తయారీ కోసం తమ పంట ఉత్పత్తులను సరఫరా చేసిన రైతులకు సుమారు రూ.1.6 లక్షల కోట్ల మేర చెల్లింపులు జరిగినట్లు వెల్లడించింది. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే అనవసరమైన వదంతులను ప్రజలు నమ్మవద్దని కేంద్రం సూచించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu