Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Education: యూకేలో ఉచితంగా చదివే అవకాశం.. భారతీయ విద్యార్థులకు ఫుల్ స్కాలర్‌షిప్‌లు

Education: యూకేలో ఉచితంగా చదివే అవకాశం.. భారతీయ విద్యార్థులకు ఫుల్ స్కాలర్‌షిప్‌లు

hmtv 1 week ago

Education: విదేశాల్లో చదవాలని కలలు కనే భారతీయ విద్యార్థులకు ఇదొక శుభవార్త అని చెప్పాలి. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి యూకేలోని ప్రముఖ యూనివర్సిటీలు భారతీయ విద్యార్థులకు ఫుల్, పార్ట్ స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు.

ప్రముఖ యూనివర్సిటీల నుంచి భారీ అవకాశాలు

యూకేలోని ప్రముఖ విద్యాసంస్థలు అయిన యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫోర్డ్‌, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌, యూనివర్సిటీ ఆఫ్ వార్‌విక్ వంటి యూనివర్సిటీలు భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న ఈ యూనివర్సిటీల్లో చదివే అవకాశం రావడం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉన్నత చదువులు, పరిశోధనలపై ఆసక్తి ఉన్న వారికి ఇవి గొప్ప అవకాశాలుగా మారనున్నాయి.

పూర్తి ఖర్చును భరించే స్కాలర్‌షిప్‌లు

ఈ స్కాలర్‌షిప్‌లలో రోడ్స్ స్కాలర్‌షిప్‌, గేట్స్ కేమ్‌బ్రిడ్జి, ఫ్లెక్స్ స్కాలర్‌షిప్ వంటి ప్రముఖ పథకాలు ఉన్నాయి. వీటి ద్వారా విద్యార్థుల ట్యూషన్ ఫీజు మాత్రమే కాకుండా హాస్టల్ ఖర్చులు, జీవన వ్యయాలు, విమాన టికెట్లు కూడా కవర్ అవుతాయి. కొన్ని యూనివర్సిటీలు ఫీజులో 50 శాతం వరకు రాయితీలు కూడా ఇస్తున్నాయి. దీంతో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా యూకేలో చదివే అవకాశం పొందగలుగుతారు.

స్కాలర్‌షిప్‌కు కావాల్సిన అర్హతలు

ఈ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు మంచి అకడమిక్ రికార్డు తప్పనిసరి. సాధారణంగా 65 నుంచి 70 శాతం మార్కులు ఉండాలని చాలా యూనివర్సిటీలు సూచిస్తున్నాయి. అదనంగా IELTS, TOEFL లేదా PTE వంటి ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ టెస్టుల్లో మంచి స్కోర్ ఉండాలి. కొన్ని స్కాలర్‌షిప్‌లలో లీడర్‌షిప్ నైపుణ్యాలు, రీసెర్చ్ సామర్థ్యం, సామాజిక సేవ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే విద్యార్థులు ముందుగానే తమ ప్రొఫైల్‌ను బలంగా తయారుచేసుకోవడం మంచిది.

భారతీయ విద్యార్థుల్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కాలర్‌షిప్‌లు

చెవింగ్ స్కాలర్‌షిప్‌, కామన్‌వెల్త్ స్కాలర్‌షిప్ భారతీయ విద్యార్థుల్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కాలర్‌షిప్‌లుగా గుర్తింపు పొందాయి. ఈ రెండు స్కాలర్‌షిప్‌లలో పూర్తి ట్యూషన్ ఫీజుతో పాటు వసతి, ప్రయాణ ఖర్చులు కూడా అందిస్తారు. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం యూకే వెళ్లాలనుకునే విద్యార్థులు ఎక్కువగా ఈ స్కాలర్‌షిప్‌లకే దరఖాస్తు చేస్తుంటారు.

దరఖాస్తు ఎప్పటి నుంచి ప్రారంభం?

2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన చాలా స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియ 2025 ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది. అందుకే విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు ఇప్పటినుంచే అవసరమైన పత్రాలు, ఇంగ్లీష్ టెస్ట్ ప్రిపరేషన్, అకడమిక్ ప్రొఫైల్ సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంటే స్కాలర్‌షిప్ పొందే అవకాశాలు మరింత పెరుగుతాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu