Eluru: అగ్ని బాధితులకు యుటిఎం భరోసా!
ఏలూరు జిల్లా: వేలేరుపాడు మండలం పరిధిలోని చిగురుమామడి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో నాలుగు ఇండ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి.
ఈ అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన చుండ్రుగొండ నరసింహులు, రవి, సింగబాబు, శ్రీనుల కుటుంబాలకు యుటిఎం ప్రెసిడెంట్ స్టీఫేన్ దొర నిత్యవసర సరుకులు కూరగాయలు, బియ్యం, కుర్చీలు, గిన్నెలు, బకెట్లు, ఐరన్ మంచాలు, దుప్పట్ల తోపాటుగా 5 వేల రూపాయలఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో యుటిఎం స్టీఫెన్ దొర బృదం మోజెస్,ఫాదర్ సుధాకర్, పండు ,రాజు,కృపారావు యాకూబ్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

