Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Fire Accident: ఐడీఏ బొల్లారం ప్రారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం

Fire Accident: ఐడీఏ బొల్లారం ప్రారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం

hmtv 2 weeks ago

Fire Accident: ఐడీఏ బొల్లారం ప్రారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం

Fire Accident: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

ఇక్కడి గ్లోకెమ్ (Glochem) పరిశ్రమలోని ఒక బ్లాకులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో కార్మికులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ప్రమాదం జరిగిన వెంటనే పరిశ్రమలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పరిశ్రమ యాజమాన్యం సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు గంటపాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ ప్రమాదంపై ఐడీఏ బొల్లారం ఎస్సై కృష్ణారెడ్డి స్పందిస్తూ.. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, అయితే ఆస్తినష్టంపై అంచనా వేస్తున్నామని ఆయన వివరించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu