Dailyhunt
Fuel Saving Tips:  ప్రయాణంలో పెట్రోల్‌, డీజిల్‌ ఆదా కావాలంటే...ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి

Fuel Saving Tips: ప్రయాణంలో పెట్రోల్‌, డీజిల్‌ ఆదా కావాలంటే...ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి

hmtv 1 week ago

Fuel Saving Tips: ప్రయాణంలో పెట్రోల్‌, డీజిల్‌ ఆదా కావాలంటే...ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి

Fuel Saving Tips: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు రవాణా తగ్గిపోతున్నది.

ఫలితంగా దేశంలో ఇంధనం ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే లీటర్‌ పెట్రోల్‌ రూ. 100 దాటిన ఈ పరిస్థితుల్లో కారు వినియోగం చాలా మందికి భారంగా మారింది. అయితే, డ్రైవింగ్‌లో కొన్ని చిన్న మార్పులు చేస్తే, 10% నుంచి 25% వరకు ఇంధనాన్ని ఆదా చేయడం సాధ్యమే అని నిపుణులు చెబుతున్నారు. మరి ఇంధనాన్ని ఆదా చేసే ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్థిరమైన వేగం - మైలేజీకి మంత్రం

కారు నడిపేటప్పుడు వేగం చాలా ముఖ్యం. చాలా వేగంగా లేదా చాలా నెమ్మదిగా నడిపితే ఇంధనం ఎక్కువ ఖర్చవుతుంది. గంటకు 50-70 కిలోమీటర్ల మధ్య వేగం ఎక్కువ మైలేజీ ఇస్తుంది. తరచూ బ్రేక్‌లు వేయడం, వేగాన్ని అకస్మాత్తుగా పెంచడం వల్ల ఇంధనం వృథా అవుతుంది.

క్లచ్ వినియోగంలో జాగ్రత్త

ట్రాఫిక్‌లో చాలా మంది డ్రైవర్లు క్లచ్‌పై కాలు ఉంచి డ్రైవ్ చేస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పుగా పరిగణించాలి. ఇలా చేస్తే క్లచ్ ప్లేట్లు త్వరగా అరిగిపోవడమే కాకుండా, ఇంధనం కూడా 5% వరకు ఎక్కువ ఖర్చవుతుంది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే క్లచ్ వాడాలి. క్లచ్‌ వాడకాన్ని ఎంత పొదుపుగా వినియోగిస్తే ఇంధనం అంత ఆదా అవుతుంది.

సరైన గేర్ - సరైన సమయం

గేర్ మార్చడం కూడా మైలేజీపై ప్రభావం చూపుతుంది. తక్కువ వేగంలో హై గేర్ లేదా ఎక్కువ వేగంలో లో గేర్ వాడితే ఇంజిన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఉదాహరణకు, 20-30 కేఎంపీహెచ్‌ వద్ద 2వ గేర్, 40-50 వద్ద 3వ గేర్ వాడటం మంచిది. ఇలా చేస్తే ఇంజిన్ పనితీరు మెరుగుపడుతుంది.

ఇంజిన్ ఆఫ్ చేయడం అలవాటు చేసుకోండి

సిగ్నల్ వద్ద లేదా ఎక్కడైనా 30 సెకన్ల కంటే ఎక్కువ ఆగాల్సి వస్తే ఇంజిన్ ఆఫ్ చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల రోజుకు కనీసం 0.1-0.2 లీటర్లు ఇంధనం ఆదా అవుతుంది. ఇది నెలకు మంచి సేవింగ్ అవుతుంది. ఇంజిన్‌ పనితం కూడా మెరుగుపడుతుంది.

రెగ్యులర్ సర్వీసింగ్

సమయానికి సర్వీసింగ్ చేయకపోతే ఇంజిన్ పనితీరు తగ్గిపోతుంది. ఫిల్టర్స్ క్లీన్ చేయకపోతే లేదా ఇంజిన్ ఆయిల్ మార్చకపోతే ఇంధనం ఎక్కువ ఖర్చవుతుంది. ప్రతి 5,000 నుంచి 10,000 కిలోమీటర్లకు ఒకసారి సర్వీసింగ్ చేయించడం ఉత్తమం. కష్టమైనా సరే రెగ్యులర్‌ సర్వీస్‌ను అలవాటు చేసుకోవాలి.

టైర్లలో గాలి - కీలక అంశం

టైర్లలో సరైన గాలి లేకపోతే కారు ముందుకు కదలడానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. ఫలితంగా ఇంధనం వృథా అవుతుంది. టైర్లలో గాలి 10% తక్కువ ఉంటే, మైలేజీ 3-4% తగ్గుతుంది. కాబట్టి వారానికి ఒకసారి గాలి చెక్ చేయడం మంచిది.

అనవసర బరువు తగ్గించండి

కారులో ఎక్కువ బరువు ఉంటే ఇంధనం ఎక్కువ ఖర్చవుతుంది. బూట్‌లో అవసరం లేని వస్తువులు పెట్టుకోవడం మానేయాలి. ప్రతి 50 కిలోల అదనపు బరువుతో 1-2% మైలేజీ తగ్గుతుంది. తక్కువ లగేజ్‌తో ప్రయాణం చేయడం ఉత్తమం.

చిన్న దూరాలకు ప్రత్యామ్నాయం

రోజువారీ 1-2 కిలోమీటర్ల దూరాలకు కార్ ఉపయోగించకుండా నడవడం లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడటం మంచిది. దీని వల్ల ఇంధనం సేవ్ అవ్వడమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

ఇంధనం ఆదా చేయడం అంటే కేవలం ఖర్చు తగ్గించడం మాత్రమే కాదు… అది ఒక మంచి అలవాటుగా కూడా పరిగణించాలి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ జేబుకూ, పర్యావరణానికీ మేలు జరుగుతుంది. డ్రైవింగ్ స్టైల్ మార్చుకుంటేనే పెద్ద సేవింగ్ సాధ్యమవుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu