Gajuwaka: గాజువాకలో 'పెద్ది' సందడి.. మెగా అభిమానుల భారీ సంబరాలు!
Gajuwaka: ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న పెద్ది చిత్రం విడుదల సందర్భంగా గాజువాక రామ్ చరణ్ ఫాన్స్ యువసేన ఫ్యాన్స్ సంబరాలు మోహిని థియేటర్లో అంబరాన్ని తాకాయి.
ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫాన్స్ మెగాస్టార్ ఫ్యాన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ సంయుక్తంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిజెపి గాజువాక నియోజవర్గ ఇంచార్జ్ రాష్ట్ర మీడియా పేనలిస్టు నరసింహారావు మోహిని థియేటర్ యాజమాని చిన్ని అలాగే జనసేన పార్టీ 58 అధ్యక్షుడు ఎం ధర్మేంద్ర 66వ జనసేన కార్యకర్తలైన లంక లతా బిజెపి కార్యకర్త రాపేడు సునీల్ కుమార్ రాంచరణ్ ఫాన్స్ ఎం కిషోర్ అరవింద్ శ్రీను శేఖర్ సంతోష్ కుమార్ గణేష్ ఎం గణేష్ సాయి చరణ్ అనిల్ మంజునాథ్ సాయినాథ్ సుబ్బు చైతు కుమార్ రాజు తదితరులు పెద్ద ఎత్తున రామ్ చరణ్ ఫాన్స్ పాల్గొన్నారు.
పెద్ది సినిమా బారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత మెగా పవర్ స్టార్ రామ్ చరన్ టీంకి అభినందనలు తెలిపారు.

