Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gangadhara: గంగాధరలో బీజేపీ రాస్తారోకో.. స్తంభించిన ట్రాఫిక్

Gangadhara: గంగాధరలో బీజేపీ రాస్తారోకో.. స్తంభించిన ట్రాఫిక్

hmtv 2 weeks ago

Gangadhara: గంగాధరలో బీజేపీ రాస్తారోకో.. స్తంభించిన ట్రాఫిక్

Gangadhara: చొప్పదండి నియోజకవర్గంలోని ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో 'తరుగు' పేరుతో అదనపు ధాన్యం తూకం వేస్తున్న దోపిడీకి స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పూర్తి బాధ్యత వహించాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ చౌరస్తాలో బీజేపీ మండల అద్యక్షులు పంజాల ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు బీజేపీ నాయకులు రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వంపై, స్థానిక యంత్రాంగంపై నిప్పులు చెరిగారు.

నాణ్యమైన ధాన్యాన్ని కూడా కావాలనే 'బి-గ్రేడ్'గా మారుస్తూ, క్వింటాల్‌కు రూ. 20 చొప్పున ధరలో కోత విధిస్తున్నారని మండిపడ్డారు. చొప్పదండి నియోజకవర్గంలో రైతులను నిలువునా ముంచే కొత్త తరహా దోపిడీకి తెరలేపారని ఆయన ఎద్దేవా చేశారు.

ఉద్దేశపూర్వకంగానే కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించారని, దీనివల్ల 17% ఉండాల్సిన తేమ శాతం 11%కి పడిపోయిందన్నారు. దీనివల్ల రైతులు క్వింటాల్‌కు అదనంగా 6 కిలోల ధాన్యాన్ని నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎఫ్‌సీఐ నిబంధనల కంటే తాలు తక్కువగా ఉన్నప్పటికీ, అధికార పార్టీ అండతో మిల్లర్లు చెలరేగిపోతున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో ఏ ఒక్క తహసీల్దార్ కూడా కొనుగోలు కేంద్రాలను సందర్శించకపోవడం వెనుక ఉన్న మర్మమేంటని ఆయన ప్రశ్నించారు.

గత పదేళ్ల పాలనలో సంచికి 5-6 కిలోల తరుగు తీసి రైతులకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు అదే పని చేస్తున్న కాంగ్రెస్‌ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

డిమాండ్లు:

ఎలాంటి తరుగు కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి. కొనుగోలు కేంద్రాలకు లారీల సంఖ్యను వెంటనే రెట్టింపు చేయాలి. నాణ్యమైన ధాన్యాన్ని బి-గ్రేడ్ కింద కొంటున్న మిల్లర్లపై, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న సివిల్ సప్లై అధికారులపై చీటింగ్ కేసులు నమోదు చేయాలి.

రైతు ప్రయోజనాలను గాలికొదిలేస్తే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అన్నాడి కృష్ణారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు, వైద రామానుజం బీజేపీ జిల్లా కోశాధికారి, పేరుక శ్రవణ్ కుమార్ అసెంబ్లీ కన్వీనర్, దూలం కల్యాణ్ ఓబీసీ జిల్లా అధ్యక్షులు, కోల అశోక్ మాజీ మండల అధ్యక్షులు, ఎడవల్లి శశిధర్ రెడ్డి బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా కిసాన్ మోర్చా నాయకులు తూమ్ నారాయణ,

సర్పంచులు మల్యాల వినయ్ సాగర్, గుండెల్ని మల్లేశం, గంకిడి చంద్రారెడ్డి, ఉప సర్పంచులు గుండారపు మధు, గాలిపెల్లి శ్రీనివాస్, చంద్రశేఖర్,

జిల్లా నాయకులు వినుకొండ నరసింహారెడ్డి, సుద్దాల రవీందర్ రెడ్డి, పెంచాల రాములు ఆకుల మనోహర్, మండల నాయకులు రేండ్ల శ్రీనివాస్, తాళ్ల రాజశేఖర్ ,బొమ్మ కంటి రాజిరెడ్డి, సుద్దాల వంశీకృష్ణారెడ్డి,పృథ్వి గౌడ్, దయ్యాల ప్రణయ్, పుల్కం లక్ష్మణ్, రావుల సత్యనారాయణ, రేగుల భార్గవ్, గరిగంటి సుమన్, సుంకరి అనిల్, వోడ్నాల రాజు, బత్తిని శ్రీధర్,

దాసరి ఆంజనేయులు, తుమ్ కరుణాకర్, పలమారి శ్రీనివాస్ ,సర్వ వినోద్, చిందం ఆంజనేయులు దేశెట్టి శ్రీనివాస్, మిట్ట గోపి, వేముల గంగన్న,గుండె వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu