Gangaram: రాజీవ్ గాంధీ వర్ధంతి.. ఐటీ, టెలికాం విప్లవానికి ఆయనే పునాది
గంగారాం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మర్రిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి &స్త్రీ శిశు సంక్షేమ శాఖ శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు మాజీ ఎంపీపీ సువర్ణపాక సరోజన జగ్గారావు గారి ఆధ్వర్యంలో ఆధునిక భారతానికి పునాధులు వేసి, అణగారిన బతుకుల్లో వెలుగు నింపి, ఆఖరి క్షణం వరకు దేశం కోసమే బతికిన మహానేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా మర్రిగూడెంలో జరుపుకున్నారు.
మాజీ ఎంపీపీ సువర్ణపాక సరోజన జగ్గారావు మాట్లాడుతూ మన భారత దేశ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడు అయినా ఆరవ ప్రధాన మంత్రి మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను ప్రవేశపెట్టిననేత, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ దేశంలో స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేయడానికి పంచాయితీ రాజ్ వ్యవస్థకు చట్టబద్దత కల్పించారు. కంప్యూటర్, టెలికాం విప్లం భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) మరియు టెలికాం విప్లవానికి ఆయనే పునాది వేశారు.
గ్రామీణ ప్రాంతాలకు సీతం తెలిఫోన్ సేవలు ( STD/ PCO )విస్తరించారు. 1989లో రాజ్యాంగ సవరణ చేసి ఓటు హక్కు పొందే వయస్సును 21 సంవత్సరాలనుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. శాంతి ఒప్పంధాలు ఈశాన్య రాష్టాల్లో శాంతిని పునరుద్దరించడానికి అసోం ఒప్పందం, మీజో ఒప్పందం వంటి కీలకమైన శాంతి ఒప్పంధాలపై సంతకం చేశారు.
ఆయన కుటుంబ నేపథ్యం భారతదేశపు మొట్టమొదటి ప్రధాన మంత్రి జవహర్లల్ నెహ్రూ మనుమడు, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పెద్ద కుమారుడు, ప్రస్తుత పార్లమెంట్ ప్రతిపక్షం నాయకులు రాహుల్ గాంధీ నాన్నగారు.1984 అక్టోబర్ లో తల్లి ఇందిరా గాంధీ హత్యకు గురికావడంతో తల్లికి అండగా అనూహ్య పరిస్థితుల్లో అయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఆ తరువాత భారతదేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
చివరిగా తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్ లో 1991 మే 21 జరిగిన ప్రచార సభలో ఎల్,టి,టి,ఇ (LTTE ) ఉగ్రవాదుల ఆత్మహుతి దాడిలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. భారతదేశ సాంకేతిక పురోగతికి మరియు ఆధునికరణకు రాజీవ్ గాంధీ అందించిన సేవలను గంగారం మాజీ ఎంపీపీ సువర్ణపాక సరోజన జగ్గారావు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మద్దెల సాంబయ్య, మర్రిగూడెం సర్పంచ్ మేడ స్వరూప సారయ్య, ఉప సర్పంచ్ సువర్ణపాక దీపక్, వార్డు నంబర్ లు కిరణ్మయి దీనెష్, మద్దెల లక్ష్మి సూర్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్లపెల్లి తనీషా, సువర్ణపాక సమ్మరావు, సువర్ణపాక లక్ష్మీనర్సు, బొల్లెపెల్లి నాగేశ్వరావు, మహమ్మద్ హైమద్, సువర్ణపాక సురేందర్ తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

