Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Golden Bra: వామ్మో ..ఆ మహిళా ఎంపీ బంగారంతో బ్రా చేయించుకుందా..?

Golden Bra: వామ్మో ..ఆ మహిళా ఎంపీ బంగారంతో బ్రా చేయించుకుందా..?

hmtv 2 weeks ago

Golden Bra: వామ్మో ..ఆ మహిళా ఎంపీ బంగారంతో బ్రా చేయించుకుందా..?

Golden Bra: అంతర్యుద్ధాలు, రాజకీయ అనిశ్చితి, పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ఇరాక్ దేశంలో ఇప్పుడు ఒక సంచలన ఆపరేషన్ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

అవినీతి తిమింగలాల గుట్టు రట్టు చేసేందుకు అక్కడి కొత్త ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ డాన్ క్రాక్‌డౌన్ ఆ దేశ రాజకీయ వర్గాల్లో పెను భూకంపాన్ని సృష్టిస్తోంది.

కొత్త ప్రధానమంత్రి అలీ అల్-జైదీ నేతృత్వంలో ఇరాక్ భద్రతా దళాలు ఇటీవల ఒకేసారి మెరుపు దాడులకు దిగాయి. రాజధాని బాగ్దాద్‌లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే గ్రీన్ జోన్‌తో పాటు పలు నగరాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. సిట్టింగ్ ఎంపీలు, మాజీ మంత్రులు, ఉన్నతాధికారుల ఇళ్లను భద్రతా దళాలు అకస్మాత్తుగా ముట్టడించాయి. ఈ దాడుల్లో కళ్లు చెదిరే రీతిలో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ ఎత్తున నగదు, నల్లధనం, కిలోల కొద్దీ బంగారు బిస్కెట్లు, విలాసవంతమైన వస్తువులు, చివరకు రహస్య గుర్రాల శాలలు కూడా బయటపడ్డాయి. ఈ మెరుపు తనిఖీల్లో ఇప్పటివరకు 67 మందికి పైగా అవినీతి అధికారులు, తాజా, మాజీ ప్రజాప్రతినిధులను భద్రతా దళాలు ఊచకోతగా అరెస్టు చేశాయి.

ఈ దాడులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్న వేళ.. ఒక పోస్ట్ మాత్రం యావత్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇరాక్ మహిళా ఎంపీ హింద్ అల్-అబ్బాసి ఇంట్లో అధికారులు జరిపిన సోదాల్లో దాదాపు రూ.475 కోట్ల నగదు, అపారమైన బంగారంతో పాటు.. ఏకంగా బంగారంతో తయారు చేసిన అండర్ వేర్ సెట్‌తో పాటు బంగారంతో కూడిన బ్రా లభించిందంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. దేశం పేదరికంలో ఉంటే ప్రజాప్రతినిధులు ఇంతటి విలాసాలకు, అవినీతికి పాల్పడతారా అంటూ నెటిజన్లు ఆ మహిళా ఎంపీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఈ వైరల్ వార్తపై అంతర్జాతీయ మీడియా, ఇరాక్ స్థానిక మీడియా నివేదికలు ఆరా తీయగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాక్‌లో ఒక ఎంపీ ఇంట్లో భారీగా నగదు, బంగారం సీజ్ అయిన మాట వాస్తవమే. అయితే, వైరల్ అవుతున్నట్లుగా అది మహిళా ఎంపీ హింద్ అల్-అబ్బాసి ఇంట్లో కాదని జాతీయ మీడియా స్పష్టం చేసింది. అన్నింటికంటే ముఖ్యంగా, ఈ దాడుల్లో బంగారు లోదుస్తులు దొరికాయనే ప్రచారానికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకర్షించడానికి, క్లిక్స్ , వ్యూస్ కోసం కొందరు అనామక వ్యక్తులు ఒక పాత ఫోటోను తెచ్చి ఈ అవినీతి దాడుల వార్తకు ముడిపెట్టి ఫేక్ ప్రచారాన్ని సృష్టించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తేల్చి చెప్పాయి.

ఆపరేషన్ డాన్ క్రాక్‌డౌన్‌ను విజయవంతం చేయడం కోసం ఇరాక్ కొత్త ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈ దాడుల బాధ్యతను సాధారణ పోలీసులకు అప్పగిస్తే లంచాలకు లొంగిపోతారని లేదా నిందితులు రాజకీయ రౌడీలతో దాడులు చేయించే ప్రమాదం ఉందని ప్రభుత్వం ముందే ఊహించింది. అందుకే దేశంలోనే అత్యున్నత రక్షణ విభాగమైన, ఎవరికీ లొంగని కౌంటర్ టెర్రరిజం ఫోర్స్‌ను రంగంలోకి దించింది. ఈ కరుడుగట్టిన కమాండోల ఎంట్రీతో అవినీతి నేతల ఆటలు సాగలేదు. పేదరికంతో సామాన్య ప్రజలు అలమటిస్తుంటే, నేతలు మిలియన్ల కొద్దీ డాలర్లు, బంగారాన్ని ఇళ్లలో కుప్పలుగా దాచుకోవడంపై ఇరాక్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu