Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gooty: సైబర్ క్రైమ్స్, పోక్సో చట్టాలపై స్టూడెంట్స్‌కు పోలీస్ క్లాస్!

Gooty: సైబర్ క్రైమ్స్, పోక్సో చట్టాలపై స్టూడెంట్స్‌కు పోలీస్ క్లాస్!

hmtv 11 hrs ago

Gooty: సైబర్ క్రైమ్స్, పోక్సో చట్టాలపై స్టూడెంట్స్‌కు పోలీస్ క్లాస్!

గుత్తి: అనంతపురం SP శ్రీ జగదీశ్ IPS గారి సూచనల మేరకు, గుంతకల్ SDPO శ్రీ శ్రీనివాస్ గారి ఆదేశాలతో అనంతపురం జిల్లా గుత్తి సీఐ రామారావు ఆధ్వర్యంలోఈరోజు గుత్తి మోడల్ స్కూల్ నందు విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి CI రామారావు గారు హాజరై విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.డ్రగ్స్/గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, మహిళలు మరియు పిల్లలపై జరిగే నేరాలు, POCSO చట్టం, బాల్యవివాహాలు, సైబర్ మోసాలు, రోడ్డు భద్రతా సూత్రాలు, స్త్రీరక్ష యాప్ వినియోగం తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటి విషయాలను తమ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయాలని సూచించారు. సమాజంలో ఎలాంటి అనుమానాస్పద సంఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై సురేష్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu