Dailyhunt
Gudihathnur: ప్రయాణికుల అవస్థలు.. ఎండలో ఎండుతూ బస్సు కోసం వెయిటింగ్!

Gudihathnur: ప్రయాణికుల అవస్థలు.. ఎండలో ఎండుతూ బస్సు కోసం వెయిటింగ్!

hmtv 1 week ago

Gudihathnur: ప్రయాణికుల అవస్థలు.. ఎండలో ఎండుతూ బస్సు కోసం వెయిటింగ్!

​Gudihathnur: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోనీ నిర్మల్, హైదరాబాద్ వైపు వెళ్ళే ప్రయాణికుల పరిస్థితి దయనీయంగా మారింది, గతంలో ఇక్కడ ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ ఉండేది, కానీ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా నేషనల్ అథారిటీ హైవే వారు దానిని తొలగించారు.

ప్రస్తుతం ఎండాకాలం కావడంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

సరైన నీడ లేకపోవడంతో ప్రయాణికులు మండుతున్న ఎండలో గంటల తరబడి బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు మరియు చిన్న పిల్లలు ఎండ తీవ్రతకు అల్లాడిపోతున్నారు. రహదారి విస్తరణ పనులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో, శాశ్వత బస్ షెల్టర్ నిర్మించే వరకు కనీసం తాత్కాలికంగానైనా ఒక షెడ్ ఏర్పాటు చేయాలని స్థానికులు మరియు ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu