Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gudur: గూడూరులో కూరగాయల మార్కెట్ ప్రారంభం.. సైకిల్‌పై వచ్చిన ఎమ్మెల్యే!

Gudur: గూడూరులో కూరగాయల మార్కెట్ ప్రారంభం.. సైకిల్‌పై వచ్చిన ఎమ్మెల్యే!

hmtv 1 week ago

Gudur: గూడూరులో కూరగాయల మార్కెట్ ప్రారంభం.. సైకిల్‌పై వచ్చిన ఎమ్మెల్యే!

Gudur: గూడూరు పట్టణంలోని ఐసిఎస్ రోడ్డు లో నిర్మించిన కూరగాయల మార్కెట్ షాపుల సముదాయాన్ని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ టెంకాయ కొట్టి పూజలు నిర్వహించి ప్రారంభించారు మార్కెట్ వ్యాపారస్తులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు లాటరీ పద్ధతి ద్వారా వ్యాపారస్తులకు షాపులను కేటాయించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నామని గత వైసీపీ ప్రభుత్వంలో నూతన కూరగాయల మార్కెట్ను అస్తవ్యస్తంగా నిర్మించి నిరుపయోగంగా వదిలేశారని మార్కెట్లో పూర్తిస్థాయిలో మాలిక వసతులు ఏర్పాటు చేసి నేడు ప్రారంభించడం జరిగిందని గతంలో ఉన్న వ్యాపారస్తులకే షాపులు లక్కీ డిప్ ద్వారా కేటాయించడం జరిగిందని వెల్లడించారు పంచాయతీ రాజ్ మరియు 15 ఫైనాన్స్ నిధులు వచ్చాయని దీని ద్వారా పట్టణంలో రోడ్లు డ్రైనేజీ కాలువలు త్వరలో పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు ప్రధానమంత్రి పిలుపుమేరకు పెట్రోల్ వాడకం తగ్గించేందుకు పట్టణంలో జరిగే కార్యక్రమాలకు సైకిల్ పైనే వస్తానని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు నాయకులు కిరణ్ కుమార్,భాస్కర్ రెడ్డి చెంచురామయ్య రహీం శ్రీనివాసులు మట్టం శ్రావణి లీలావతి భారతి కల్పన ప్రణీత్ యాదవ్ ఓం చరణ్ చంద్రనిల్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu