Guntur: జె.వి. రత్నంకు రాష్ట్ర స్థాయి 'జీవవైవిధ్య పరిరక్షణ' అవార్డు!
Guntur: జీవవైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మండలి చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ కోరారు.
శుక్రవారం గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం లో అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా అవార్డులు అందజేశారు. ప్రధానంగా వ్యక్తిగత విభాగంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, అలాగే తిరుపతి నుంచి బండారు బాలసుబ్రహ్మణ్యం, భూషణం మాష్టారు తదితరులకు అందజేశారు.
ప్రధానంగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ విషయానికి వస్తె గడిచిన 36 సంవత్సరాల లో 5.9 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయడం. 8.9 లక్షల మట్టి పాత్రలు పశుపక్ష్యాదులకు నీరు ఏర్పాటు చేయడం, 2. 8 లక్షల పిచ్చుకల గూళ్ళు ఏర్పాటు , ఏటా పది వేల నుండి నుండి 50 వేల ధాన్యం కంకులతో కుచ్చులు తోరణాలు తయారీ, పంపిణీ చేయడం, ప్రతి సంవత్సరం యుఎన్ పర్యావరణ దినోత్సవాల కాలమానిని ముద్రించి విద్యా సంస్థలకు అందజేస్తోంది.
అలాగే జిల్లా కలెక్టరేట్, జివిఎంసి, ఎపి పిసిబి, అటవీశాఖ, ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాల, విభిన్న స్వచ్చంద సంస్థ లు, దాతృత్వం కలిగిన వారి సహాయంతో ఈ సంస్థ తమ విభిన్న కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్రతి ఏటా నాటుతున్న మొక్కలు, పెంచుతున్న కూరగాయలు మొక్కలు, విత్తనాలు పంపిణీ, మన ఇంట కూరగాయల పంటలు, వంటింటి వ్యర్ధాలతో ఎరువు తయారీ, ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం వీటిని దృష్టిలోకి తీసుకుని జీవవైవిధ్య మండలి ఈ అవార్డు అందజేసింది.
ఈ అవార్డుల కార్యక్రమంలో మెంబర్ సెక్రటరీ రామకృష్ణ, ఎపి అటవీ శాఖ అభివృద్ధి మండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నందినీ సలారియా, మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ సిఇఒ చంద్ర శేఖర్, నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సింహాచలం, బోటనీ ప్రొఫెసర్ బ్రహ్మాజీ, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ జాతీయ ప్రతినిధి ఫరీడా తదితరులు పాల్గొని మాట్లాడారు.

