Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hanamakonda: హన్మకొండ కాంగ్రెస్ ఆఫీస్‌లో రాజీవ్ గాంధీ వర్ధంతి

Hanamakonda: హన్మకొండ కాంగ్రెస్ ఆఫీస్‌లో రాజీవ్ గాంధీ వర్ధంతి

hmtv 3 days ago

Hanamakonda: హన్మకొండ కాంగ్రెస్ ఆఫీస్‌లో రాజీవ్ గాంధీ వర్ధంతి

నుమకొండ: భారతదేశ ఆధునిక సాంకేతిక విప్లవ పితామహుడు, దేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

డీసీసీ అధ్యక్షులు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య , పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, దేశానికి ఆయన చేసిన త్యాగాలను, సేవలను స్మరించుకుని నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. యువతకు ఓటు హక్కు కల్పించడంతో పాటు, ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి భారత ముఖచిత్రాన్ని మార్చిన మహోన్నత నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త దేశ సేవలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పింగిలి వెంకట్రామ్ నరసింహ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ (Library) ఛైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బంక సరళ, జిల్లా కమిటీ నాయకులు,కార్యకర్తలు తదితరులు శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu