Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hanumakonda: ప్రైవేట్ దవాఖానాలపై హనుమకొండ జిల్లా యంత్రాంగం నిఘా

Hanumakonda: ప్రైవేట్ దవాఖానాలపై హనుమకొండ జిల్లా యంత్రాంగం నిఘా

hmtv 5 days ago

Hanumakonda: ప్రైవేట్ దవాఖానాలపై హనుమకొండ జిల్లా యంత్రాంగం నిఘా

Hanumakonda: ప్రైవేట్ క్లినిక్‌లు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రులు తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టంలోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.

రవి సూచించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మిని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన జిల్లా రిజిస్టరింగ్ అథారిటీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవలు, నిర్వహించే పరీక్షలు, వాటికి వసూలు చేసే రుసుముల వివరాలతో కూడిన ధరల పట్టికను రోగులు, వారి సహాయకులకు స్పష్టంగా కనిపించే విధంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించేందుకు ఇది అత్యంత అవసరమని పేర్కొన్నారు.

అలాగే ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలు, ఫైర్ సేఫ్టీ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. రోగుల భద్రత, ఆరోగ్య పరిరక్షణ విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా అన్ని ప్రమాణాలు పాటించాలని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య జిల్లాలోని ఆసుపత్రుల్లో నిర్వహించిన తనిఖీలు, జారీ చేసిన నోటీసులు, తీసుకున్న చర్యల వివరాలను కమిటీ సభ్యులకు వివరించారు.

జిల్లాలో ప్రస్తుతం 780 ప్రైవేట్ క్లినిక్‌లు, ఆసుపత్రులతో పాటు 118 ప్రభుత్వ డిస్పెన్సరీలు, పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు నమోదు చేయబడినట్లు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu