Dailyhunt
Honor Play 70C : రూ.9 వేలకే 5300mAh బ్యాటరీ, 90Hz డిస్‌ప్లే.. ఫీచర్స్ చూస్తే నమ్మలేరు.!

Honor Play 70C : రూ.9 వేలకే 5300mAh బ్యాటరీ, 90Hz డిస్‌ప్లే.. ఫీచర్స్ చూస్తే నమ్మలేరు.!

hmtv 1 week ago

Honor-Play-70C

Honor Play 70C : హానర్ కంపెనీ తన లేటెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ Honor Play 70Cని చైనా మార్కెట్లో అఫీషియల్‌గా లాంచ్ చేసింది.

అయితే.. హానర్ ప్లే 80 ప్లస్‌తో పాటు విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్, స్టైలిష్ లుక్, అదిరిపోయే బ్యాటరీ లైఫ్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. మెయిన్‌గా తక్కువ ధరలో మంచి పర్ఫార్మెన్స్ కోరుకునే వారిని టార్గెట్ చేస్తూ, లేక్ బ్లూ, మూన్‌లిట్ సిల్వర్, ఇంక్ రాక్ బ్లాక్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చారు.

స్మూత్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్

ఈ ఫోన్‌లో 6.75-అంగుళాల HD+ TFT LCD డిస్‌ప్లేను అందించారు, ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీనివల్ల గేమింగ్, సోషల్ మీడియా స్క్రోలింగ్ చేసేటప్పుడు యూజర్లకు చాలా స్మూత్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. స్క్రీన్-టు-బాడీ రేషియో 90.7 శాతంగా ఉండటంతో విజువల్స్ చాలా క్లారిటీగా కనిపిస్తాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో MediaTek Helio G81 Ultra ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను వాడారు. ఇది ఆండ్రాయిడ్ 15 బేస్డ్ మెజిక్ ఓఎస్ 9.0 సాఫ్ట్‌వేర్‌పై రన్ అవుతుంది. మెమరీ పరంగా 4GB , 6GB ర్యామ్ వేరియంట్లు, అలాగే 128GB వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఇందులో కలవు.

కెమెరా క్వాలిటీ , స్మార్ట్ సెన్సార్లు

ఫోటోగ్రఫీ కోసం హానర్ ప్లే 70C వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను అమర్చారు. ఇది రోజువారీ అవసరాలకు తగ్గట్టుగా మంచి ఫోటోలను క్లిక్ చేస్తుంది. సెల్ఫీలు , వీడియో కాల్స్ కోసం ముందు వైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇక సెక్యూరిటీ , యూజర్ కన్వీనియన్స్ కోసం ఇందులో యాక్సిలెరోమీటర్, గ్రావిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ , ప్రాక్సిమిటీ సెన్సార్లు వంటి ఫీచర్లను కూడా అందించారు. కనెక్టివిటీ కోసం బ్లూటూత్, 3.5mm ఆడియో జాక్ , USB టైప్-సి పోర్ట్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, ప్రైస్ డీటెయిల్స్

ఈ స్మార్ట్‌ఫోన్‌లోని మెయిన్ హైలైట్ దాని 5,300mAh బ్యాటరీ. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 14 గంటల పాటు కంటిన్యూగా స్క్రోలింగ్ చేసుకోవచ్చని లేదా 10 గంటల పాటు వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. స్టాండ్‌బై టైమ్ విషయానికి వస్తే ఇది ఏకంగా 71 గంటల వరకు పవర్ బ్యాకప్ ఇస్తుంది. ధర విషయానికి వస్తే, 4GB+64GB బేస్ వేరియంట్ సుమారు రూ. 9,000 (CNY 599) నుంచి ప్రారంభమవుతుంది. అలాగే 4GB+128GB మోడల్ రూ. 10,000 (CNY 699) , టాప్ ఎండ్ 6GB+128GB మోడల్ రూ. 12,000 (CNY 799) ధరలలో లభిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu