Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hyderabad: ఆన్‌లైన్ మెడిసిన్ విక్రయాలపై ఔషధ వ్యాపారుల పోరాటం

Hyderabad: ఆన్‌లైన్ మెడిసిన్ విక్రయాలపై ఔషధ వ్యాపారుల పోరాటం

hmtv 6 days ago

Hyderabad: ఆన్‌లైన్ మెడిసిన్ విక్రయాలపై ఔషధ వ్యాపారుల పోరాటం

Hyderabad: ఆన్లైన్ లో విచ్చలవిడిగా జరుగుతున్న మెడిసిన్ విక్రయాలకు నిరసనగా ఈ నెల 20న ఒక్కరోజు బంద్ తలపెట్టినట్లు హైదరాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తెలిపింది.

ప్రిన్క్రెప్షన్ లేకుండా డిస్కౌంట్ ల పేరుతో కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రజా ఆరోగ్యాలతో చెలగాటం అడుతున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు ఆరుగొండ శ్రీధర్ గుప్త , గౌరవ అధ్యక్షుడు వెంకటరమణ రెడ్డి లు ఆందోళ వ్యక్తం చేశారు.

హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. నార్కోటిక్ డ్రగ్స్ ఆన్లైన్ లో విక్రయాలు జరగడం వల్ల యువత మత్తుకు బానిస అవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం కృషి చేస్తుంటే, ఆన్లైన్ లో హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ లభ్యమవుతున్నాయని అన్నారు.

ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం తాము ఒక్కరోజు బంద్ లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. అల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు 12 లక్షలకు పైగా మెడికల్ షాపు నిర్వాహకులు ఈ బంద్ లో పాల్గొననున్నట్లు తెలిపారు. బంద్ రోజు ఎమర్జెన్సీ మెడిసిన్ అవసరం ఉన్నవాళ్లు 7569359595 నెంబర్ కు సంప్రదిస్తే , వారికి మెడిసిన్ అందజేస్తామని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu