Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hyderabad: ఆయాన్ కోచింగ్ సెంటర్ ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య

Hyderabad: ఆయాన్ కోచింగ్ సెంటర్ ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య

hmtv 5 days ago

Hyderabad: ఆయాన్ కోచింగ్ సెంటర్ ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్: ఎల్బీనగర్,... తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ ప్రయాణంలో, రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, నిరుద్యోగ యువతకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరిన తరుణంలో ఆత్మ బలిదానాలతో స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజానీకానికి పాలించినటువంటి ప్రభుత్వాలు ఏ మేరకు ప్రజా పాలనను సాగించాయో దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ మేరకు సోమవారం ఎల్బీనగర్ నియోజకవర్గం దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలోని పిల్లర్ నెంబర్ 543 సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయాన్ కోచింగ్ సెంటర్ నాలుగో బ్రాంచ్ ని చైర్మన్ డాక్టర్ మహమ్మద్ అన్వర్ తో కలిసి ఆర్ కృష్ణయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.... తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలన, రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాజకీయ మార్పులే జరిగాయి తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. రాజకీయాలను అడ్డం పెట్టుకొని కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా కుల మత వర్గ సత్సంబంధాలతో వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

రాజకీయాల కోసమే మార్పులు జరిగాయే తప్ప నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా జీవన విధానం ఏమేరకు దీనవస్థలో ఉందో ఇట్టే అర్థమవుతుందన్నారు. ప్రజల ఓట్లతోనే నెగ్గిన ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను పక్కనపెట్టి స్వలాభాల కోసం అక్రమాలకు పాల్పడుతూ వందల దాటి వేల కోట్ల అక్రమ సంపాదనకు పడగలెత్తారన్నారు. ప్రజల కోసం చేసేటటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా దోపిడి వ్యవస్థను పెంచి ఓచిస్తున్నటువంటి పరిస్థితులు దాపరిచాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏఒక్కటి పూర్తిస్థాయిలో అమలు చేసిందో ముఖ్యమంత్రి, ప్రభుత్వ పాలకులకే తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులు ఏమేరకు ఉద్యోగాలు ఇచ్చారో దమ్ముంటే ప్రజల ముందు పెట్టాలన్నారు. రాష్ట్రంలో నేటి యువతరం నిరుద్యోగులుగా మిగిలిపోయి కూలీలుగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఆశలతో ఉన్నతమైన ఆశయాలతో కష్టపడి చదివినటువంటి లక్షలాదిమంది విద్యార్థులు సరైన ఉపాధి అవకాశాలు లేక, ప్రభుత్వం కూడా పట్టించుకోక ప్రధాన నగరాల్లో కూలీలుగా మారుతున్నారన్నారు. ఈ తరుణంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసే విద్యార్థులు, నిరుద్యోగులకు బాసటగా నిలవాలని సంకల్పంతో డాక్టర్ మహమ్మద్ అన్వర్ స్థాపించినటువంటి ఆయాన్ కోచింగ్ సెంటర్ తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ముందుకు తీసుకెళ్లే బాధ్యతను, భరోసాను కల్పిస్తుందన్నారు.

సామాన్య మధ్యతరగతి నిరుద్యోగులకు పోలీసు ఉద్యోగంపై మక్కువ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉత్తమ కోచింగ్ సెంటర్ గా తెలంగాణ రాష్ట్రంలో అయాన్ కోచింగ్ సెంటర్ నిలవడం శుభ పరిణామం అన్నారు. దిల్సుఖ్నగర్ ప్రాంతంలో అయాన్ కోచింగ్ సెంటర్ నాలుగో బ్రాంచ్ ఓపెన్ కావడం ఈ ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమన్నారు. పోటీ పరీక్షల కోసం శిక్షణ అందిస్తున్న మహమ్మద్ అన్వర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. రాత పరీక్షలతో పాటు ఫిజికల్ ట్రైనింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా యువత ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు.

రాష్ట్రంలోని పోలీస్, విద్య, వైద్యం, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల్లో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని, వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ లేకపోవడంతో నిరుద్యోగ యువత వయోపరిమితి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నీలం వెంకటేష్, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జి అనంతయ్య, విద్యార్థి సంఘం అధ్యక్షులు పగిళ్ల సతీష్, బీసీ సంఘం అధ్యక్షులు రాజేందర్, బీసీ సంఘం కన్వీనర్ శివకుమార్ యాదవ్, భీమరాజ్ యాదవ్, సెక్రెటరీ జనరల్ అంజి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu