Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hyderabad: బండి భగీరథ్ కేసులో తీవ్ర ఉత్కంఠ.. కోర్టుకు తరలింపు?

Hyderabad: బండి భగీరథ్ కేసులో తీవ్ర ఉత్కంఠ.. కోర్టుకు తరలింపు?

hmtv 1 week ago

Hyderabad: బండి భగీరథ్ కేసులో తీవ్ర ఉత్కంఠ.. కోర్టుకు తరలింపు?

Hyderabad: పేట్ బషీరాబాద్ ఫోక్సో కేసులో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు.

బండి భగీరథ హైదరాబాద్ నుండి పారిపోకుండా నోటీసులు జారీచేసిన పోలీసులు. ఏ ఎయిర్ పోర్టులో భగీరథ కనిపించిన తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో మెన్షన్ చేసిన పోలీసులు. బండి భగీరథ కోసం తీవ్రంగా గాలిస్తున్న పేట్ బషీరాబాద్ పోలీసులు. నాలుగు బృందాలతో వెతుకులాట..!

డిల్లీ కరీంనగర్ హైదరాబాద్ లో విస్తృతంగా గాలింపు. బండి భగీరథ్ తండ్రి సంజయ్ నివాసంలో సోదాలు. కరీంనగర్ లోని భగీరథ్ మేనమామ వంశీకృష్ణ నివాసం సహా ఇతర బంధువుల ఇంట్లో సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు డిల్లీలో బీజేపీ నేతల రక్షణలో ఉన్నట్లు కూడా సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి గాలింపు చేస్తున్న తెలంగాణ పోలీసులు.

ఇదిలా ఉంటే పోక్సో కేసు నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.. అయితే అతను ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. ఈరోజు సాయంత్రం వరకు మేడ్చల్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించవచ్చనే ప్రచారం సాగుతోంది. ఒకవైపు లుక్ ఔట్ నోటీస్.. మరోవైపు లొంగిపోనున్నాడనే సమాచారంతో కొంత అయోమయం నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu