Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hyderabad: బెట్టింగ్ లకు పాల్పడుతూ చైన్ స్నాచింగ్ చేసిన ఆర్మీ జవాన్

Hyderabad: బెట్టింగ్ లకు పాల్పడుతూ చైన్ స్నాచింగ్ చేసిన ఆర్మీ జవాన్

hmtv 1 week ago

Hyderabad: బెట్టింగ్ లకు పాల్పడుతూ చైన్ స్నాచింగ్ చేసిన ఆర్మీ జవాన్

Hyderabad: క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతూ చైన్ స్నాచింగ్ చేసిన ఆర్మీ జవాన్ ను నేరేడ్మెట్ పోలీసులు అరెస్టు చేసి గురువారం రిమాండ్ కు తరలించారు.

మల్కాజిగిరి ఏసిపి యాదగిరి రెడ్డి మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

విశ్వసనీయ సమాచారం ఆధారంగా నేరేడ్‌మెట్ పోలీసులు బుధవారం రాత్రి 10:30 గంటలకు అల్వాల్‌ లోని డాల్ఫిన్ వైన్ షాప్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని

అరెస్ట్ అయిన నిందితుడు కుర్రపోతుల రెడ్డి శేఖర్ (31)ఆర్మీలో జనరల్ డ్యూటీ జవాన్‌గా పనిచేస్తూ అల్వాల్‌ లోని త్రిశూల్ లైన్ ఆర్మీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు.స్వస్థలం వైఎస్సార్ కడప జిల్లా సంబేపల్లె మండలం గోరవంద్లపల్లి గ్రామం. నిందితుడు క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడి భారీ అప్పుల్లో కూరుకుపోయాడని. అప్పులు తీర్చేందుకు డబ్బు కోసం మహిళల బంగారు గొలుసులు లాక్కోవాలని నిర్ణయించుకోని

మే 10వ తేదీ సాయంత్రం తన బజాజ్ పల్సర్ బైక్‌పై బయటకు వచ్చిన నిందితుడు,ముందుగా డాల్ఫిన్ వైన్ షాప్ దగ్గర పాన్ షాప్ వద్ద ఆగి,సీసీ కెమెరాల్లో గుర్తుపట్టకుండా ఉండేందుకు తన బైక్ నంబర్ ప్లేట్‌ను మార్చాడు. అసలు నంబర్ AP 04 BX 7477 స్థానంలో నకిలీ స్టికర్ AP 04 AX 8474ను లక్ష్మీ రేడియం అండ్ ఫ్లెక్స్ ప్రింటింగ్ వద్ద తయారు చేయించుకున్నాడు.

తర్వాత సప్తగిరి కాలనీలో నివాసం ఉంటున్న జొన్నగడ్డ యోగేందర్ మణి మేఘల (57) అనే గృహిణిని లక్ష్యంగా చేసుకున్నాడు.అడ్రస్ అడుగుతున్నట్లు నటించి ఆమె మెడలో ఉన్న సుమారు 3 తులాల నల్లపూసల బంగారు గొలుసును లాక్కొని బైక్‌పై పరారయ్యాడు. బంగారు గొలుసును ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టి డబ్బుగా మార్చుకున్నాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్,సాంకేతిక ఆధారాల సహాయంతో విచారణ చేపట్టి నిందితుడిని గుర్తించారు. అనంతరం పక్కా సమాచారంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఈ కేసును డీసీపీ మల్కాజిగిరి జోన్ శ్రీధర్ ఐపీఎస్ పర్యవేక్షణలో, ఏసీపీ మల్కాజిగిరి శ్రీ వి.యాదగిరి రెడ్డి మార్గదర్శకత్వంలో నేరేడ్‌మెట్ ఇన్‌స్పెక్టర్ సందీప్ కుమార్,ఎస్సై చంద్రశేఖర్ మరియు క్రైమ్ స్టాఫ్ బృందం కలిసి కేసు చేదించి నిందితుడిని పట్టుకొని రిమాండ్ కు తరలించామని ఏసిపి నేరేడుమెట్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu