Dailyhunt
Hyderabad: దోమ తెర ధరించి అసెంబ్లీకి ఎమ్మెల్యే.. సుధీర్ రెడ్డి వినూత్న నిరసన!

Hyderabad: దోమ తెర ధరించి అసెంబ్లీకి ఎమ్మెల్యే.. సుధీర్ రెడ్డి వినూత్న నిరసన!

hmtv 2 weeks ago

Hyderabad: దోమ తెర ధరించి అసెంబ్లీకి ఎమ్మెల్యే.. సుధీర్ రెడ్డి వినూత్న నిరసన!

Hyderabad: భాగ్యనగరంలో రోజురోజుకూ పెరుగుతున్న దోమల సమస్యపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

నగర ప్రజలు దోమల ధాటికి పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన నేరుగా అసెంబ్లీ వేదికను ఎంచుకున్నారు. అయితే, ఈ క్రమంలో అసెంబ్లీ వద్ద హైడ్రామా చోటుచేసుకుంది.

వినూత్న వేషధారణలో ఎమ్మెల్యే

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఒంటికి దోమ తెరను చుట్టుకుని, చేతిలో ఫాగింగ్ యంత్రాన్ని పట్టుకుని అసెంబ్లీ గేటు వద్దకు చేరుకున్నారు. నగరంలో దోమల తీవ్రత ఎంతలా ఉందో చాటిచెప్పడమే తన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అయితే, లోపలికి అనుమతి లేదంటూ అసెంబ్లీ మార్షల్స్ ఆయనను అడ్డుకున్నారు. ఆయన ధరించిన దోమ తెరను తొలగించేందుకు మార్షల్స్ ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.

మార్షల్స్‌పై ఆగ్రహం - కొత్త నిబంధనలపై ప్రశ్నలు

మార్షల్స్ తీరుపై సుధీర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరగడం లేదు.. అలాంటప్పుడు లోపలికి వెళ్లకూడదనే కొత్త నిబంధనలు ఎక్కడి నుంచి వచ్చాయి?" అని ఆయన ప్రశ్నించారు. ప్రజల సమస్యలను ప్రతిబింబించేలా నిరసన తెలిపే హక్కు తమకు ఉందంటూ మార్షల్స్‌తో వాగ్వాదానికి దిగారు.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోంది..

అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సుధీర్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నగరంలో దోమల బెడద భరించలేక ప్రజలు హైదరాబాద్ వదిలి పారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుధ్య లోపం వల్ల నగరం యొక్క 'బ్రాండ్ ఇమేజ్' అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతింటోందని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మురుగు కాలువలను శుభ్రం చేయాలని, ఫాగింగ్ చర్యలను ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు. నగరవాసుల ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని, దోమల బెడద నుంచి విముక్తి కల్పించే వరకు తన పోరాటం ఆపనని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu