Hyderabad: గొల్లలతో కాకుండా కురుమలకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలి!
హైదరాబాద్: కురుమలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కురుమ యువ చైతన్య సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘమ అధ్యక్షుడు వెంకటేష్ కుర్మా మాట్లాడారు.
గొల్ల సామాజిక వర్గంతో కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో తమ సామాజిక వర్గ ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కుల గణన సందర్భంగా తమ సామాజిక వర్గ ప్రజలను తక్కువగా చెప్పడంతో తమకు గుర్తింపు లేకుండా పోతుందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే గొల్లలతో కాకుండా తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నెలరోజుల్లోపు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

