Hyderabad: హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో ట్విస్ట్
Hyderabad: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య తనూజ హత్య కేసులో ట్విస్ట్ తెరపైకి వచ్చింది.
పనిమనిషి కల్పనతో పాటు ముఠాలో మరో ఏడుగురి ప్రమేయం ఉన్నట్టు గుర్తించిన జూబ్లీహిల్స్ పోలీసులు.. నేపాలీ గ్యాంగ్‌లోని ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ముంబైలో పట్టుబడ్డ సునీల్ పర్యార్‌ను విచారించి కీలక విషయాలు రాబట్టారు. సునీల్ పర్యార్ సమాచారంతో ముంబైలో తులం బంగారం రికవరీ చేసుకున్నారు.

