Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hyderabad: హరీష్‌రావుపై ఉస్మానియా యూనివర్సిటీ పీఎస్‌లో ఫిర్యాదు!

Hyderabad: హరీష్‌రావుపై ఉస్మానియా యూనివర్సిటీ పీఎస్‌లో ఫిర్యాదు!

hmtv 1 week ago

Hyderabad: హరీష్‌రావుపై ఉస్మానియా యూనివర్సిటీ పీఎస్‌లో ఫిర్యాదు!

హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావుపై టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

విద్యార్థులతో కలిసి పోలీసులను కలిసి పిర్యాదు అందజేసిన ఆయన, తెలంగాణ ప్రజలకు హాని కలిగేలా క్షుద్ర పూజలు నిర్వహించారంటూ ఆరోపిస్తూ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా చనగాని దయాకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకుండా, ప్రజలు కరువు కాటకాలతో ఇబ్బందులు ఎదుర్కోవాలనే ఉద్దేశంతో హరీష్‌రావు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు వెళ్లి క్షుద్ర పూజలు నిర్వహించారంటూ ఆరోపించారు. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇటువంటి చర్యలకు పాల్పడటం సమాజానికి తగదని, ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రజలకు హరీష్‌రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులు, మహిళలు, నిరుద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని, రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తున్న సమయంలో ఇటువంటి చర్యలపై వస్తున్న ఆరోపణలు ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నంగా భావిస్తున్నామని ఆయన విమర్శించారు.

ఈ అంశంపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, ఆరోపణల నిజానిజాలను వెలికితీసి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని చనగాని దయాకర్ కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu