Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hyderabad: మియాపూర్‌లో సీఏ విద్యార్థి అనుమానాస్పద మృతి!

Hyderabad: మియాపూర్‌లో సీఏ విద్యార్థి అనుమానాస్పద మృతి!

hmtv 1 week ago

హైదరాబాద్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గోకుల్ ప్లాట్స్‌లో విషాదం. చార్టెడ్ అకౌంటెంట్ (CA) చదువుతున్న కుమ్మరి జనార్ధన్ అనే విద్యార్థి తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో రక్తపు మరకలు ఉండటంతో జనార్ధన్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మియాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. రక్తపు మరకల నేపథ్యంలో ఇది ఆత్మహత్యా లేక మరేదైనా కారణమా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu