Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hyderabad: రహస్యంగా రెండో పెళ్లి.. నిలదీసిన మొదటి భార్యపై దాడి!

Hyderabad: రహస్యంగా రెండో పెళ్లి.. నిలదీసిన మొదటి భార్యపై దాడి!

hmtv 1 week ago

Hyderabad: రహస్యంగా రెండో పెళ్లి.. నిలదీసిన మొదటి భార్యపై దాడి!

Hyderabad: కట్టుకున్న భార్యను, మూడేళ్ల కొడుకును కాదని రహస్యంగా రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా, నిలదీసిన మొదటి భార్యపై దాడికి పాల్పడిన ఘోర ఉదంతం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలంటూ బాధితురాలు భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది.

బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. బండా రోహిత్ యాదవ్ అనే వ్యక్తికి మహాలక్ష్మి అనే మహిళతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం మూడు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. అయితే, కొంతకాలంగా భార్యాపిల్లలను సరిగ్గా పట్టించుకోని రోహిత్ యాదవ్. ఇటీవల మొదటి భార్యకు తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు.

విషయం తెలిసి భర్తను నిలదీసేందుకు వెళ్లిన మొదటి భార్య మహాలక్ష్మిపై రోహిత్ యాదవ్ దాడికి పాల్పడ్డాడు. తనను, తన కొడుకును వద్దంటూ వేధిస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహాలక్ష్మి, తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త ఇంటి ముందే న్యాయం చేయాలంటూ నిరసనకు దిగింది. తమకు జరిగిన అన్యాయంపై బాధితురాలు మహాలక్ష్మి చందానగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu