Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hyderabad: తెలంగాణ వేడుకల బ్రోచర్ ఆవిష్కరణ.. కాంగ్రెస్‌పై జగదీశ్ ఫైర్

Hyderabad: తెలంగాణ వేడుకల బ్రోచర్ ఆవిష్కరణ.. కాంగ్రెస్‌పై జగదీశ్ ఫైర్

hmtv 2 days ago

Hyderabad: తెలంగాణ వేడుకల బ్రోచర్ ఆవిష్కరణ.. కాంగ్రెస్‌పై జగదీశ్ ఫైర్

Hyderabad: మలేషియా తెలంగాణ అసోసియేషన్, బీఆర్ఎస్ మలేషియా సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6న కౌలాలంపూర్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి.

ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ వేడుకల బ్రోచర్‌ను మాజీ మంత్రి జి. జగదీశ్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ: ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ పేరును గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. రెండున్నరేళ్లుగా తెలంగాణలో కేసీఆర్ లేని లోటు కనిపిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతోందని, కేసీఆర్ పథకాలను కూడా కొనసాగించలేకపోతోందని ఆరోపించారు.

ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నా రైతులకు విత్తనాలు, ఎరువులు ఇచ్చే స్థితిలో ప్రభుత్వం లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్నారని విమర్శించారు.

దేశంలో బీజేపీ పాలనలో చిన్న పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని, తెలంగాణలో మైనర్ బాలిక ఘటనపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ ప్రజలకు, మహిళలకు శ్రీరామరక్ష అని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. అమెరికా డల్లాస్‌లో గతంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయని కూడా ఆయన గుర్తు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu