Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hyderabad: వనస్థలిపురంలో ఓటరు జాబితా ప్రత్యేక పరిశీలన..

Hyderabad: వనస్థలిపురంలో ఓటరు జాబితా ప్రత్యేక పరిశీలన..

hmtv 3 weeks ago

Hyderabad: వనస్థలిపురంలో ఓటరు జాబితా ప్రత్యేక పరిశీలన..

Hyderabad: ఎల్బీనగర్ నియోజకవర్గం లోని వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో ఈరోజు BLOలతో కలిసి SIR (Special Intensive Revision) ఓటర్ ప్రక్రియపై బూత్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లగ్గొని శ్రీధర్ గౌడ్ గారు, కాలనీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లగ్గొని శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ: కాలనీవాసులందరికీ ఓటు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, BLOలు ఇంటింటికి తిరిగి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు సక్రమంగా నమోదు కావడానికి అవసరమైన పత్రాలను వెంటనే సమర్పించాలని కోరారు. ఎవరికైనా సమస్యలు ఉంటే సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించాలని తెలిపారు.

ఓటు హక్కు ప్రతి పౌరుడికి అత్యంత విలువైన రాజ్యాంగ హక్కు అని, ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను తప్పనిసరిగా పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu