Dailyhunt
Ibrahimpatnam Municipality: ఉత్కంఠకు తెర.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం..!

Ibrahimpatnam Municipality: ఉత్కంఠకు తెర.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం..!

hmtv 1 week ago

Ibrahimpatnam Municipality: ఉత్కంఠకు తెర.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం..!

Ibrahimpatnam Municipality: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది.

అనూహ్య సమీకరణాల నడుమ మున్సిపాలిటీని బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్‌గా బీఆర్‌ఎస్‌కు చెందిన టేకుల సుదర్శన్‌రెడ్డి ఎన్నికయ్యారు.

ఈ ఎన్నికలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌కు మద్దతుగా బీజేపీ నిలవడంతో, పదవుల పంపకంలో భాగంగా వైస్‌ ఛైర్‌పర్సన్‌ పదవి బీజేపీని వరించింది. బీజేపీ కౌన్సిలర్‌ ముత్యాల శ్యామల వైస్‌ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అధికార కాంగ్రెస్‌కు చెక్ పెట్టే క్రమంలో బీఆర్‌ఎస్, బీజేపీ కౌన్సిలర్లు ఏకతాటిపైకి రావడం ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మొత్తానికి పంతం నెగ్గించుకున్న బీఆర్‌ఎస్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠంపై గులాబీ జెండాను ఎగురవేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu