Dailyhunt
Ichchapuram: రైలు ఎక్కేలోపే బుక్కయ్యారు.. గంజాయి సీజ్!

Ichchapuram: రైలు ఎక్కేలోపే బుక్కయ్యారు.. గంజాయి సీజ్!

hmtv 3 weeks ago

Ichchapuram: రైలు ఎక్కేలోపే బుక్కయ్యారు.. గంజాయి సీజ్!

Ichchapuram: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

ఆదివారం సాయంత్రం ఎం. తోటూరు జంక్షన్ రైల్వే క్రాసింగ్ గేటు వద్ద ఈ ఘటన జరిగింది. ఇచ్చాపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ ఆర్. జనార్థనరావు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

తనిఖీ చేయగా, వారి వద్ద 2.100 కేజీల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, తూకం వేసే చిన్న యంత్రం లభ్యమయ్యాయి. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. పట్టణ సీఐ ఎం.చిన్నాం నాయుడు తెలిపిన వివరాల ప్రకారం, అరెస్టు కాబడిన భుక్త బలరాం, బింగి కుమార్ ఇద్దరూ ఇచ్చాపురం మండలం కేదారిపురం గ్రామానికి చెందినవారు. గంజాయి వినియోగానికి అలవాటు పడ్డ వీరు,

తాము పనిచేస్తున్న అచ్చ్యుతాపురంలో చిన్న ప్యాకెట్లుగా చేసి అధిక ధరలకు విక్రయించాలని యోచించారు. ఈ క్రమంలో బరంపురంలో గంజాయి సరఫరా చేసే వ్యక్తి వద్ద నుంచి కేజీకి రూ.3000 చొప్పున రెండు కేజీల గంజాయిని కొనుగోలు చేసి అచ్చ్యుతాపురం వెళ్లేందుకు బయలుదేరారు. ఇచ్చాపురంలో రైలు ఎక్కే ప్రయత్నంలో ఉండగా పోలీసులు తనిఖీలు నిర్వహించి వారిని పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu